Jinn | తెలుగులో సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న చిత్రం జిన్ (Jinn). చిన్మయ్ రామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అమిత్ రావ్, పర్వేజ్ సింబా లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. వరదరాజ్ చిక్‌బళ్లాపుర డైలాగ్స్ అందిస్తున్న ఈ మూవీ నుంచి షేర్ చేసిన పోస్టర్, ట్రైలర్ నెట్టింట హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
భూతనాల చెరువు నేపథ్యం ఏంటీ..? కాలేజ్‌లో దాగి ఉన్న మిస్టరీ ఎంటీ.? అనే ఎలిమెంట్స్ తో సస్పెన్స్‌గా సాగుతున్న ట్రైలర్ క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఈ మూవీ డిసెంబర్ 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ చిన్మయ్ రామ్ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
యాక్టర్ పర్వేజ్ సింబాకు వచ్చిన ఒక కల ఆధారంగా ఈ స్టోరీని సిద్దం చేశామని డైరెక్టర్ చిన్మయ్ రామ్ తెలిపారు. షూటింగ్ టైంలో సెట్లో లైట్లు ఆగిపోవడం, కెమెరాలు పనిచేయకపోవడం లాంటి వింత అనుభవాలు ఎదురయ్యాయన్నాడు. అంతేకాదు ప్రమోషన్స్ టైంలో జరిగిన కారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడటం అదృష్టమని గుర్తు చేసుకున్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ అలెక్స్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని.. ప్రేక్షకులు పెట్టే ప్రతీ రూపాయికి సరిపోయే వినోదాన్ని అందిస్తామని హామీనిచ్చారు. జిన్ సక్సెస్ అయితే సీక్వెల్ జిన్ 2 పనులు కూడా షురూ చేస్తామని.. స్క్రిప్ట్ కూడా రెడీగా ఉందని చెప్పాడు. ఈ చిత్రంలో పర్వీజ్ సింబా, ప్రకాశ్ తుంబినాడు, రవి భట్, సంగీత కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Rashmika Mandanna | షూటింగ్లకి గ్యాప్.. ఫ్రెండ్స్‌తో కలిసి శ్రీలంకలో ప్రత్యక్షమైన రష్మిక
Suriya | కో యాక్టర్ కుమారుడి మెడలో గోల్డ్ చైన్ వేసిన సూర్య.. వీడియో వైరల్