Rashmika Mandanna | నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం సినిమాల స్పీడ్ పెంచడమే కాదు, వెకేషన్లను కూడా అదే రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా తన గర్ల్ గ్యాంగ్‌తో కలిసి శ్రీలంకలో ప్రత్యక్షమయ్యింది. షూటింగ్ షెడ్యూల్స్ మధ్య కేవలం రెండు రోజులు గ్యాప్ దొరకడంతో, రష్మిక తన స్నేహితురాలు, నటి వర్ష బొల్లమ్మ, ఇతర స్నేహితులతో కలిసి శ్రీలంకకు వెళ్లారు. అక్కడ బీచ్ తీరాన పసుపు రంగు డ్రెస్‌లో చిల్ అవుతున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. “గర్ల్స్ ట్రిప్స్ ఎప్పుడూ స్పెషలే” అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు. కొబ్బరి నీళ్లు తాగుతూ, ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
అయితే ఈ ట్రిప్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో రష్మిక తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లడం.. అది వెకేషన్ కాదు, పెళ్లికి ముందు ఇచ్చే ‘బ్యాచిలరేట్ పార్టీ’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వర్ష బొల్లమ్మ, ఆనంద్ దేవరకొండతో రిలేషన్లో ఉన్నారనే వార్తలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరు ‘తోడికోడళ్లు’ కలిసి ట్రిప్‌కు వెళ్లడం చూస్తుంటే, దేవరకొండ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయిపోతున్నారు.