Mana Shankara Varaprasad Garu | అనిల్ రావిపూడి అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే పాటలు, కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే వినోదం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం.
అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu). ‘పండగకు వస్తున్నారు’ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నయనతార ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. వెంకటేశ్ కామియో రోల్ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా 2026 జనవరి 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా బీటీఎస్ వీడియోను షేర్ చేశారు.
ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా పసందైన విందు భోజనంలా చిరు-అనిల్ రావిపూడి మార్క్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతుందని బీటీఎస్ వీడియో చెప్పకనే చెబుతోంది. ఇప్పటికే మన శంకర వర ప్రసాద్ గారు నుంచి విడుదల చేసిన మీసాల పిల్ల, శశిరేఖ సాంగ్స్‌ను మ్యూజిక్ లవర్స్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో వీటీవీ గణేశ్, కేథరిన్ థ్రెసా, హర్షవర్దన్, రేవంత్ భీమల (సంక్రాంతికి వస్తున్నాం) ఫేం బుల్లిరాజు) కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల-విష్ణు ప్రసాద్ హోం బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
మరో 25 రోజుల్లో…#ManaShankaraVaraPrasadGaru నవ్వుల సంక్రాంతిని తీసుకొస్తున్నారు 😍❤️ pic.twitter.com/05KYbUM6iD
— SURENDRA PILLELLA (@SURENDRAPILLEL1) December 18, 2025
Aadarsha Kutumbam | వెంకటేష్–త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్లో మార్పు?
Bigg Boss 9 | టైటిల్ రేస్‌లో ట్విస్ట్.. విన్నర్ ఎవరు? అందరిలో పెరిగిన ఉత్కంఠ
Spirit | ప్రభాస్‌కి న్యూ ఇయర్ బ్రేక్ రద్దు.. టైట్ షెడ్యూల్ ఫిక్స్ చేసిన సందీప్ వంగా..!