Suriya| అభిమానులు, మూవీ లవర్స్‌కు కావాల్సిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించేందుకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడు కోలీవుడ్ యాక్టర్ సూర్య. వీటిలో ఒకటి వెంకీ అట్లూరి డైరెక్షన్లో చేస్తున్న సూర్య 46 (Suriya 46) ఒకటి. ఈ చిత్రంలో ప్రేమలు ఫేం మమితా బైజు హీరోయిన్గా నటిస్తోంది. సూర్య తన కోస్టార్లు, క్రూ మెంబర్స్‌ను ఎంతలా గౌరవిస్తాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు
సూర్య తన కో యాక్టర్ చరణ్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు. చరణ్ కుమారుడు చర్విక్కు గోల్డ్ చైన్‌ను బహుమతిగా ఇచ్చాడు. సూర్య 46 పూజా కార్యక్రమంలో చర్విక్ మెడలో బంగారు గొలుసు వేశాడు. అనంతరం చిన్నారి చర్విక్ను కొద్దిసేపు ఎత్తుకున్నాడు. సూర్యకు వీరాభిమాని అయిన చరణ్ ప్రస్తుతం కరుప్పు చిత్రంలో నటిస్తున్నాడు. సూర్య 47గా వస్తున్న ఈ చిత్రానికి ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు.
సూర్య తమ పట్ల చూపిన ప్రేమకు, కుమారుడికి గోల్డ్ చైన్ కానుకగా ఇచ్చి సూర్య చూపించిన ప్రేమానురాగాలకు చరణ్ కపుల్ ఫిదా అయిపోయారు. సూర్యకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సూర్య 46లో సీనియర్ నటి రవీనా టాండన్, రాధికాశరత్ కుమార్, తమిళ నటి భవాని స్రే కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సూర్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
#Suriya gifted a gold chain to a co-actor’s child working in #Suriya46❤️🔥
A simple, heartfelt gesture that reflects his caring nature.@Suriya_offl pic.twitter.com/xmG4tLzQyg
— Suresh PRO (@SureshPRO_) December 18, 2025
Aadarsha Kutumbam | వెంకటేష్–త్రివిక్రమ్ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్లో మార్పు?
Bigg Boss 9 | టైటిల్ రేస్‌లో ట్విస్ట్.. విన్నర్ ఎవరు? అందరిలో పెరిగిన ఉత్కంఠ
Spirit | ప్రభాస్‌కి న్యూ ఇయర్ బ్రేక్ రద్దు.. టైట్ షెడ్యూల్ ఫిక్స్ చేసిన సందీప్ వంగా..!