ఓ ముద్దు పెట్టవే జిగేలు రాణి (Jigelu Rani)..కన్నైనా కొట్టవే జిగేలు రాణి..ఈ పాట అందరికీ గుర్తుండే ఉంటుంది. రంగస్థలంలో వచ్చే ఈ మాస్ బీట్ ఏ రేంజ్లో ఫేమస్సయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పూజాహెగ్డే (Pooja Hegde) ఈ సాంగ్‌తో జిగేల్ రాణిగా అద్బుతమైన క్రేజ్ సంపాదించింది. ఈ పొడుగుకాళ్ల సుందరి జిగేల్ రాణి పాటకు పొట్టి గౌనులో అందాలు ఆరబోస్తూ చేసిన డ్యాన్స్ కు అందరూ ఫిదా అయిపోయారు. చాలా కాలం తర్వాత జిగేల్ రాణి కాకపుట్టించే ఫొటోలు పోస్ట్ చేయగా..నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.
పూజాహెగ్డే పోస్ట్ చేసిన ఫ్లోటింగ్ మూడ్ (నీటిపై తేలియాడే) బ్రేక్ ఫాస్ట్ (Floating Breakfast) స్టిల్స్ ఇపుడు ట్రెండింగ్ అవుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక క్షేత్రం (Jigelu Rani Maldives Breakfast) మాల్దీవుల్లో పూజాహెగ్డే స్విమ్షూట్లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని కెమెరాకు ఫోజులిచ్చింది. ఫ్లోటింగ్ బకెట్లో జ్యూస్, బర్గర్స్ తోపాటు వివిధ రకాల ఆహారపదార్థాలను ఆరగిస్తూ ఎంజాయ్ చేసింది.
మాల్దీవుల్లో సరదాగా చక్కర్లు కొడుతూ ఆహ్లాదకర వాతావరణంలో గడుపుతున్న పూజాహెగ్డే ఫొటోలు నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం ఆచార్య, రాధేశ్యామ్ చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు తమిళంలో విజయ్‌తో బీస్ట్ సినిమా చేస్తోంది.
Just an ordinary girl looking for extraordinary experiences ☺️🤎@Huvafenfushi_ pic.twitter.com/dEc6Y2UCpK
— Pooja Hegde (@hegdepooja) November 14, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Upasana: పిల్లల గురించి ఉపాసనకు ప్రశ్న.. సమాధానం ఏంటంటే..!
Upasana Surprise| ఉక్రెయిన్ లో ఉపాసన సర్ప్రైజ్..పోస్ట్ వైరల్
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి