Jawan | జీరో సినిమాతో డిజాస్టర్ అందుకున్న బీటౌన్ బాద్షా షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) లాంగ్ గ్యాప్ తర్వాత పఠాన్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చాడని తెలిసిందే. ఎప్పుడొచ్చామన్నది.. కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అంటూ ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో బాక్సాఫీస్‌కు రుచి చూపించాడు. పఠాన్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే.. తాజాగా జవాన్ (Jawan) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. దీపికా పదుకొనే కీ రోల్ పోషించింది. మూవీ లవర్స్, ఫ్యాన్స్ అంచనాలకు తగ్గకుండా సినిమా సక్సెస్ఫుల్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్తో అర్థమవుతోంది.
జవాన్ బాద్ షా నుంచి వచ్చిన మరో పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ అని.. స్క్రీన్‌ప్లే, అనిరుధ్ రవిచందర్ అందించిన బీజీఎం, షారుఖ్ ఖాన్ కిల్లింగ్ పర్ఫార్మెన్స్ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక దీపికాపదుకొనే, షారుఖ్ కాంబో అంటే మినిమం హిట్ గ్యారంటీ. ఎప్పటిలాగే జవాన్‌లో కూడా దీపికాపదుకొనే తన స్టన్నింగ్ యాక్టింగ్‌తో అదరగొట్టేసిందని, ఆమె పాత్రకు మరెవరూ న్యాయం చేయలేరని అంటున్నారు సినీ జనాలు.
Jawan
షారుఖ్ ఖాన్ మోస్ట్ ఎంటర్టైనింగ్ కమర్షియల్ సినిమా.. దీపికా అద్భుతమైన నటనతో సినిమాకే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిందని ట్రేడ్ సర్కిల్ టాక్. షారుఖ్, దీపికా కెమిస్ట్రీలో వచ్చే సాంగ్ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందంటున్నారు. మొత్తానికి ఈ సారి కూడా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద జవాన్ కలెక్షన్లు భారీగానే ఉండబోతున్నాయని ఓపెనింగ్స్ డే టాక్ ద్వారా క్లారిటీ వచ్చేస్తుంది.
Jawan1
జవాన్ టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్‌తోపాటు Jawan Prevue సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించాయడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీలో ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలలో నటించారు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీని షారుఖ్ ఖాన్ హోంబ్యానర్ రెడీ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై గౌరీఖాన్ తెరకెక్కించింది.
#OneWordReview…#Jawan: MEGA-BLOCKBUSTER.
Rating: ⭐️⭐️⭐️⭐️½
A hardcore masala entertainer that’s sure to stand tall in #SRK’s filmography… #Atlee presents #SRK in a massy character and he is 🔥🔥🔥… Move over #Pathaan, #Jawan is here to conquer hearts and #BO, both.… pic.twitter.com/4bwFrBAFYz— taran adarsh (@taran_adarsh) September 7, 2023