The Goat Life | ఓటీటీ అనౌన్స్మెంట్ ఇచ్చిన పృథ్వీరాజ్ ‘ది గోట్ లైఫ్’
Aadu Jeevitham | సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించగా.. అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Aadu Jeevitham | సలార్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వహించగా.. అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ రచయిత బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా ఈ సినిమా రాగా.. సర్వైవల్ అడ్వెంచర్‌గా వచ్చిన ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా వరల్డ్ వైడ్‌గా రూ.150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతుంది.
తాజాగా ఈ సినిమా ఓటీటీ అనౌన్స్మెంట్ వచ్చింది కానీ డేట్ మాత్రం వెల్లడించలేదు. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో త్వరలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1990లో జీవనోపాధి కోసం కేరళను వదిలి విదేశాలకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడు అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అనేది సినిమా స్టోరీ. ఇక ఈ సినిమా పూర్తిగా ఎడారిలో తెరకెక్కిన తొలి భారతీయ సినిమాగా రికార్డు సాధించింది. ఏఆర్. రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

