Devara Movie | ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం ‘దేవర’(Devara). కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో శ్రీదేవి గారలపట్టి జాన్వీకపూర్ (Janvi kapoor) మరాఠీ భామ శృతి మరాటే కథనాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే గోవాలో సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న దేవర టీమ్ తన కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వైజాగ్‌లో స్టార్ట్ కానున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ లేకుండా ఉండే సన్నివేశాలను షూట్ చేయనున్నట్లు తెలుస్తుంది.
ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం వార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కొన్ని రోజులుగా ముంబైలోనే మకం వేసిన తారక్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసుకుంటున్నాడు. వార్ 2 కంప్లీట్ అవ్వగానే దేవర షూటింగ్లో జాయిన్ కానున్నాడు. దేవర సినిమా రెండు భాగాలుగా రానుండగా.. మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.