టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) డైరెక్షన్లో సినిమా ప్రకటించాడని తెలిసిందే. భారీ స్థాయిలో రాబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జెట్ స్పీడులో కొనసాగుతున్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి ఇపుడు టాలీవుడ్లో హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ భామ జాన్వీకపూర్ (Janhvi Kapoor) తెలుగు సినిమాలో కనిపించాలని చాలా కాలంగా అనుకుంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
అయితే తన టాలీవుడ్ లాంఛింగ్‌కు రాంచరణ్ సినిమా అయితే బాగుంటుందని భావిస్తుందట జాన్వీకపూర్. అంతేకాదు ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసే ప్రయత్నంలో ఫుల్ బిజీగా ఉందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ సినిమాతో దక్షిణాదిన గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటుందనే దానిపై అఫీషియల్ అప్డేట్ ఏం రాకున్నా.. ఈ వార్తను మాత్రం జాన్వీకపూర్ ఫాలోవర్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో చేస్తున్న ఆర్సీ 15 ప్రాజెక్ట్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు రాంచరణ్. పొలిటికల్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీ న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఆర్సీ 15లో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
శ్రీకాంత్, ఎస్జే సూర్య, అంజలి ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తు్న్నారు. ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
Read Also : Bandla Ganesh | రాజకీయాలతో చాలా నష్టపోయా.. హాట్ టాపిక్‌గా బండ్ల గణేశ్ కామెంట్స్
Read Also :Boss Party making Video | వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ సాంగ్ మేకింగ్ గ్లింప్స్ వీడియో
Read Also :Yashoda | యశోద సినిమా వివాదానికి లైన్ క్లియర్.. నిర్మాత క్లారిటీ