Yashoda | యశోద సినిమా వివాదానికి లైన్ క్లియర్.. నిర్మాత క్లారిటీ
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 11న విడుదలైంది యశోద (Yashoda). సరోగసీ అంశం చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంపై ఈవా ఐవీఎఫ్ హాస్పిటల్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) టైటిల్ రోల్ పోషించిన సినిమా యశోద (Yashoda). తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 11న విడుదలైంది. సరోగసీ అంశం చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంపై ఈవా ఐవీఎఫ్ హాస్పిటల్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
యశోద చిత్రంలో తమ ఆస్పత్రిని నెగెటివ్ యాంగిల్లో చూపించారని, యశోదను నిలిపేయాలని కోరుతూ ఈవా ఐవీఎఫ్ హాస్పిటల్ టీం యశోద మేకర్స్ పై హైదరాబాద్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీంతో యశోద ఓటీటీ విడుదలను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేస్తూ కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. డిసెంబర్ 19 వరకు యశోదను ఓటీటీలో విడుదల చేయొద్దని మేకర్స్ కు నోటీసులు కూడా జారీ చేసింది.
ఈవా అనే పదం యశోదలో కనపడదు..
ఈ వ్యవహారంలో మేకర్స్-ఈవా హాస్పిటల్ బృందం రాజీకి వచ్చారు. యశోదలో ఈవా పేరు కాన్సెప్ట్‌కు అనుగుణంగానే పెట్టామని, ఇంకొకరి మనోభావాలు దెబ్బతీసేందుకు మాత్రం కాదని అన్నారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్. ఈవా హాస్పిటల్ టీంను కలిసి పూర్తి వివరాలు చెప్పాను. భవిష్యత్‌లో ఇకమీదట ఈవా అనే పదం యశోద సినిమాలో కనపడదని, ఇది తెలియక జరిగిన చిన్న పొరపాటు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. తమ నిర్ణయానికి ఈవా సంస్థ కూడా అంగీకారం తెలిపిందని, పేరు విషయంలో నెలకొన్న సమస్య పరిష్కారమైందని తెలిపారు.
ఈ విషయంపై ఈవా హాస్పిటల్ ఎండీ మోహన్ రావు మాట్లాడుతూ.. సినిమాలో మా హాస్పిటల్ పేరును వినియోగించడంతో హర్ట్ అయ్యాం. అయితే ఈ విషయాన్ని నిర్మాత దృష్టిని తీసుకెళ్లిన వెంటనే సమస్యను పరిష్కరించడంతో లైన్ క్లియర్ అయిందని తెలిపారు.
యశోద చిత్రానికి మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందించారు. యశోద చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ తెరకెక్కించారు. ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.
యశోద ట్రైలర్ ..
Read Also : Bandla Ganesh | రాజకీయాలతో చాలా నష్టపోయా.. హాట్ టాపిక్‌గా బండ్ల గణేశ్ కామెంట్స్
Read Also :Boss Party making Video | వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ సాంగ్ మేకింగ్ గ్లింప్స్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

