యాక్టర్‌గా చాలా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత నిర్మాతగా టాలీవుడ్‌కు గబ్బర్ సింగ్, టెంపర్ లాంటి భారీ హిట్స్ అందించారు బండ్లగణేశ్ (Bandla Ganesh). ఓ వైపు సినిమాల్లో కొనసాగుతూనే మరోవైపు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. గతంలో ఎన్నికల సమయంలో తనదైన స్టైల్లో స్పీచ్లిస్తూ టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా నిలిచారు.
కొన్ని సార్లు ఆయన చేసిన కామెంట్స్ వివాదాలకు కూడా దారితీశాయి. గతేడాది సరిలేరు నీకెవ్వరు సినిమాలో మళ్లీ యాక్టర్‌గా మెరిశారు బండ్ల గణేశ్. ఈ క్రేజీ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ తాజా కామెంట్స్ ఇపుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. రాజకీయాల వలన జీవితంలో చాలా నష్టపోయాను. నాకు ఏ రాజకీయాలతో ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు అందరూ ఆత్మీయులే.. అంటూ తాజాగా ఎవరూ ఊహించని ట్వీట్ చేశారు బండ్ల గణేశ్.
రాజకీయాల్లోకి వెళ్లి తన జీవితంలో అతి పెద్ద తప్పు చేశానని, ఈ నిర్ణయం వల్ల ఆర్థికంగా, మానసికంగా చాలా నష్టపోయానని ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేశ్ అన్నారు. పొలిటికల్ ఎంట్రీ వల్ల తన పరువు పోతుందని, అతి త్వరలోనే సినిమాల నిర్మాణం ప్రారంభిస్తానని చెప్పారు. బండ్ల గణేశ్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. తాజా కామెంట్స్ తో ఇక భవిష్యత్‌లో ఆయన రాజకీయాల్లో కొనసాగడం కష్టమేనని క్లారిటీ ఇచ్చేశారు.