Sailesh Kolanu | ఇక నుంచి రీమేక్స్ చేయను.. హిట్ 3కి భారీ ప్లాన్ : డైరెక్టర్ శైలేష్ కొలను చిట్‌చాట్
శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్న చిత్రం హిట్ 2 (Hit :The second case). డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శైలేష్ కొలను మీడియాతో చిట్ చాట్ చేశాడు.
టాలీవుడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) హీరోగా నటిస్తున్న చిత్రం హిట్ 2 (Hit :The second case). శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై నాని, ప్రశాంతి తిపిర్నేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ శైలేష్ కొలను మీడియాతో చిట్ చాట్ చేశాడు.
నాని హీరోగా ఎందుకు తీసుకోలేదు..?
ముందుగా స్టోరీని నానికి వినిపించా. నేనేమో ఆయనతో సినిమా చేయాలనుకుంటే.. నాని మాత్రం తానే నిర్మిస్తానన్నారు. నానితో సినిమా చేసి పెద్ద హిట్టు ఇవ్వాలని ఉంది. హిట్ 3 సినిమా భారీ ప్లాన్ చేస్తున్నాం.. త్వరలోనే వివరాలు చెబుతా.
HIT 2లో అడివి శేష్‌నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు..?
ఫస్ట్ పార్ట్‌లో విశ్వక్ సేన్ పోషించిన రుద్రరాజుకి సంబంధించిన స్టోరీ కూడా నా దగ్గరుంది. కానీ ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్పేందుకు ఫ్రాంచైజీని ప్లాన్ చేశాం. కథాంశం ఆధారంగానే నేను ఆర్టిస్టులను ఎంచుకున్నా. క్లైమాక్స్ ను రాసుకునేటపుడు అడివి శేష్ అయితే బాగుంటాడని అనిపించింది. శేష్‌కి నా కథనం నచ్చడంతో ఓకే చేశాడు. శేష్ పాత్రను కొత్త అవతార్‌లో చూపించగలిగానని అనుకుంటున్నా.
సినిమా ఆలస్యం వెనకున్న కారణమేంటి..?
ఫస్ట్ పార్ట్‌ను 6 నెలల్లో పూర్తి చేశా. సెకండ్ పార్ట్‌ను పూర్తి చేసేందుకు ఏడాది పట్టింది. కోవిడ్ ప్యాండమిక్ వల్ల ఆలస్యమైంది. ఇక నుంచి రీమేక్స్ చేయను. హిట్ హిందీలో చేసినప్పుడు చాలా మంది నన్ను సోషల్ మీడియాలో తిట్టారు. కొంతకాలంగా ప్రజలు భాషతో సంబంధం లేకుండా ఓటీటీలో సినిమాలు చూస్తున్నారు.
మీరు ఫ్రాంచైజీని ఎలా ప్లాన్ చేశారు?
మొదట నేను ఒక కొత్త అధికారిని పరిచయం చేసి అతని కథ చెప్పాలని అనుకున్నాను. ఇప్పుడు నా మనసు మార్చుకున్నా. అవెంజర్స్ లాగా ఆఫీసర్లందరినీ ఒక్కప్లాట్ఫాంపైకి తేవాలని అనుకున్నాను. ఇదే విషయాన్ని విశ్వక్ సేన్‌కి కూడా చెప్పగా.. అందుకు విశ్వక్ సేన్ ఒకే అన్నాడు. రానున్న చిత్రాలలో కూడా విశ్వక్ కనిపిస్తాడు.
నానిని ఒప్పించడం కష్టమైందా?
నానిని ఒప్పించడం కష్టంగా అనిపించదు. ఎందుకంటే సినిమాలకు సంబంధించి మా ఆలోచనా విధానం ఒకే లైన్లో ఉంటుంది. పర్ఫెక్ట్ సింకింగ్ లో ఉంటాం. కానీ శేష్‌ని ఒప్పించడం మాత్రం కొద్దిగా కష్టమే. నేను కథ చెప్పినప్పుడు అడివి శేష్ చాలా ప్రశ్నలు అడిగాడు. ఐదారు సిట్టింగ్స్ తర్వాత అడివి శేష్ ఈ సినిమాకు ఒకే చెప్పాడు.
శైలేష్ కొలను చిట్‌చాట్ స్టిల్స్ ..
#SaileshKolanu @KolanuSailesh Media Interaction 📸 Most Anticipated #HIT2#HIT2onDec2 pic.twitter.com/YWu9Ga0U28
— BA Raju's Team (@baraju_SuperHit) November 29, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

