Jailer Success Party | రజనీకాంత్ ‘జైలర్’ సక్సెస్ పార్టీ.. ఫోటోలు వైరల్
Jailer Success Party | సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం జైలర్. తమన్నా, రమ్యకృష్ణ కథానాయికలుగా నటించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సుభాస్కరన్ నిర్మించాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందీ చిత్రం. ఈ సందర్భంగా మేకర్స్ ప్రైవేట్ పార్టీ ఏర్పాటు చేశారు.
Jailer Success Party | సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం జైలర్ (Jailer). తమన్నా, రమ్యకృష్ణ కథానాయికలుగా నటించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సుభాస్కరన్ నిర్మించాడు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.550 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందీ చిత్రం. ఈ సందర్భంగా మేకర్స్ ప్రైవేట్ పార్టీ ఏర్పాటు చేశారు.
శుక్రవారం రాత్రి జరిగిన ఈ పార్టీలో సూపర్ స్టార్ రజనీకాంత్, అనిరుధ్, నెల్సన్, రమ్యకృష్ణ సహ జైలర్ టీమ్‌లోని ముఖ్యులంతా ఈ పార్టీలో సందడి చేశారు. జైలర్ బ్లాక్‌బస్టర్ అవ్వడంపట్ల తలైవకు అందరూ కంగ్రాట్స్ చెప్పారు. అయితే ఈ సినిమాలో నటించిన తమన్నా, వసంత్ రవి, యోగిబాబు మాత్రం ఈ వేడుకల్లో ఎక్కడా కనిపించలేదు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.
Party time for #Jailer 💥 pic.twitter.com/WSeqLhsp8q
— Christopher Kanagaraj (@Chrissuccess) August 25, 2023
#Jailer success party pic.twitter.com/tPgB6QbL76
— Sreedhar Pillai (@sri50) August 26, 2023
#Jailer Real success party 💥💥🙌
& what a himalayan success ❤️🔥❤️🔥Kalanithi Maran said last time #Thalaivar was this confident for #Enthiran 🙌❤️🔥
The man who understands the audiences like no one else forever ❤️#JailerHistoricBO #Rajinikanth #SuperstarRajinikanth pic.twitter.com/S5JPaNv249
— Achilles (@Searching4ligh1) August 25, 2023
ఇదిలా ఉండగా.. జైలర్ సినిమా సరికొత్త రికార్డు నెలకొల్పింది. సౌత్‌లోని అన్ని రాష్ట్రాల్లో రూ.50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. తమిళనాడు సహా రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో రూ.50 కోట్లు కలెక్ట్ చేసిన తొలి నాన్-సీక్వెల్ ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇక ఇప్పటికే తెలుగులో అత్యధిక ప్రాఫిట్స్ వచ్చిన డబ్బింగ్ సినిమా చరిత్ర సృష్టించగా.. కర్ణాటకలో ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్‌గా కన్నడ సినిమాలను కూడా దాటేసి టాప్ ప్లేస్‌లో నిల్చుంది. హిందీ మార్కెట్లోనే కాస్త డల్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కానీ.. మిగితా అన్ని భాషల్లో జైలర్ విధ్వంసమే కొనసాగుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

