Jai Bhim Director | జై భీమ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించాడు డైరెక్టర్ టీజే జ్ఞానవేళ్. కోర్టు రూం డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం డైరెక్టుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై అద్భుతమైన వ్యూయర్షిప్ను నమోదు చేసింది. ఈ సక్సెస్‌తో ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్‌తో వెట్టైయాన్ సినిమాను తెరకెక్కించే ఛాన్స్ కొట్టేశాడు. అయితే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన వెట్టైయాన్ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది.
కాగా టీజే జ్ఞానవేళ్ మరో సూపర్ స్టార్‌తో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడన్న వార్త ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరనే కదా.. మీ డౌటు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. శరవణ భవన్ స్థాపకుడు రాజగోపాల్ జీవిత కథకు సంబంధించిన స్క్రిప్ట్‌ను మోహన్ లాల్‌కు వినిపించాడట టీజే జ్ఞానవేళ్ . బిజినెస్ మెన్ రాజగోపాల్ ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవించాడు. దోస కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను జంగ్లీ పిక్చర్స్ నిర్మించబోతుందట. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశాలున్నట్టు సమాచారం.
Sai Pallavi | SIIMA Awards వేడుకలో పింక్ సారీలో మెరిసిన సాయిపల్లవి.. పిక్స్ వైరల్