Jacqueline Fernandez | బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez) కు ఢిల్లీ కోర్టు (Delhi court )లో భారీ ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసు (Money Laundering Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఎలాంటి ముందస్తు అనుమతి అవసరం లేకుండానే తన పని నిమిత్తం విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఈ మేరకు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు (Patiala House Court) ఆమె బెయిల్ షరతులను సవరించాలని నిర్ణయించింది.
రూ.200కోట్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrashekar)తో జాక్వెలిన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నిందితురాలిగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆమెకు గతేడాది నవంబర్‌లో కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు పేర్కొంది. విదేశాలకు వెళ్లడానికి మూడు రోజుల ముందు ఈడీకి సమాచారం ఇవ్వాలని పేర్కొంది. తన పర్యటనకు సంబంధించిన సమగ్ర వివరాలను అందించాలని ఆదేశించింది. అందులో ఆమె వెళ్లే దేశం, బస చేసే ప్రదేశం, సంప్రదింపు నంబర్, ఎన్నిరోజులు అక్కడ ఉంటారు..? వంటి ఇతర వివరాలను ముందుగానే కోర్టుకు సమర్పించాలని తీర్పునిచ్చింది.
అయితే, తాను నటిని కావడంతో షూటింగ్ నిమిత్తం తరచూ విదేశాలకు వెళ్లాల్సి వస్తోందని జాక్వెలిన్
కోర్టుకు విన్నవించింది. కొన్నిసార్లు తక్కువ సమయంలోనే విదేశాలకు వెళ్లేందుకు ఒప్పుకోవాల్సి వస్తోందని,
లేదంటే వృత్తిపరమైన అవకాశాలను కోల్పోతానని తెలియజేసింది. వీటిని పరిగణనలోకి తీసుకున్న
న్యాయస్థానం.. గతంలో ఇచ్చిన మినహాయింపులను జాక్వెలిన్ దుర్వినియోగం చేయలేదని గుర్తించింది. ఈ
మేరకు ఆమె బెయిల్ షరతుల్లో మార్పులు చేయాలని నిర్ణయించింది.
కాగా, రూ.200కోట్ల కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌ను
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిందితురాలిగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న
జాక్వెలిన్‌ను ఈడీ అరెస్టు చేయకపోయినా.. గతేడాది నవంబర్ 15న కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు
చేసింది. మనీలాండరింగ్ కేసులో లంకన్ బ్యూటీని ఈడీ పలుమార్లు విచారించి, ఆస్తులను సైతం అటాచ్
చేసింది.
జాక్వెలిన్‌కు సుకేశ్ చంద్రశేఖర్ రూ.7కోట్లకుపైగా విలువైన ఆభరణాలు, వస్తువులను బహుమతిగా
ఇచ్చాడని ఆరోపణలున్నాయి. అంతేకాకుండా ఆమె కుటుంబ సభ్యులకు అనేక అత్యాధునిక కార్లు, ఖరీదైన
బ్యాగులు, బట్టలు, బూట్లు, ఖరీదైన వాచ్‌లను బహుమతిగా ఈడీ ఆరోపించింది.రాన్‌బాక్సీ మాజీ బాస్
శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారిగా
నటిస్తూ సుకేష్ చంద్రశేఖర్ రూ.200 కోట్లు దోపిడీకి పాల్పడ్డాడు. ఈ కేసులో అరెస్టయిన సుకేశ్ చంద్రశేఖర్
ప్రస్తుతం జైలులో ఉన్నారు.
Also Read..
Shimla | హిమాచల్‌లో కుంభవృష్టి.. సమ్మర్ హిల్ ప్రాంతంలో మరోసారి విరిగిపడ్డ కొండచరియలు
Rishi Sunak | ప్రధానిగా కాదు.. హిందువుగా వచ్చా .. రామ కథ కార్యక్రమంలో రిషి సునాక్