Rishi Sunak | ప్రధానిగా కాదు.. హిందువుగా వచ్చా .. రామ కథ కార్యక్రమంలో రిషి సునాక్
Rishi Sunak | హిందూ విశ్వాసమే జీవితంలోని ప్రతి అంశంలో తనకు మార్గదర్శకం చేస్తుందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak ) అన్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని బ్రిటన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ (Cambridge University)లోని జీసస్ కళాశాలలో ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు (Morari Bapu) ఆధ్వర్యంలో కొనసాగుతున్న రామ కథ (Ram Katha) కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
Rishi Sunak | హిందూ విశ్వాసమే జీవితంలోని ప్రతి అంశంలో తనకు మార్గదర్శకం చేస్తుందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak ) అన్నారు. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని బ్రిటన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ (Cambridge University)లోని జీసస్ కళాశాలలో ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు (Morari Bapu) ఆధ్వర్యంలో కొనసాగుతున్న రామ కథ (Ram Katha) కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రిషి సునాక్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా, గౌరవంగా ఉందన్నారు.
‘ఈ కార్యక్రమానికి రావడం నిజంగా నాకెంతో గౌరవంగా, చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి నేను ప్రధానిగా రాలేదు. ఒక హిందువుగా వచ్చాను. విశ్వాసం అనేది నా దృష్టిలో వ్యక్తిగతం. ఇది నా జీవితంలోని ప్రతి అంశంలో నాకు మార్గదర్శకం చేస్తుంది. ప్రధాని పదవి అనేది గొప్ప గౌరవం. కానీ, అది అంత తేలికైన పని కాదు. చాలా కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో మన విశ్వాసమే మనకు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇక, ప్రవచనం వేదికపై ఏర్పాటు చేసిన హనుమంతుడి పోస్టర్‌ను ప్రస్తావించిన రిషి సునాక్.. తన అధికారిక కార్యాలయంలోని టేబుల్‌పై కూడా బంగారు గణేశుడి విగ్రహం ఉందని పేర్కొన్నారు. ‘నా కార్యాలయంలో బంగారు వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఏ పని చేసే ముందైనా వాటి గురించి తెలుసుకొని జాగ్రత్తగా పరిశీలించాలని ఆ విగ్రహం నాకు సూచిస్తుంటుంది. చిన్నతనంలో నేను తరచూ సౌతాప్టన్లోని గుడికి వెళ్లి వస్తుండేవాడిని. స్థానిక మందిరంలో నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పూజలు, హోమాలు చేసేవారు. అనంతరం నా సోదరులు, సోదరీమణులతో కలిసి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేసేవాడిని’ అని రిషి సునాక్ వివరించారు.
Also Read..
New star | వినువీధిలో కొత్త నక్షత్రం.. కనిపెట్టిన భారత సైంటిస్టులు
Geeta Govindam | మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో గీత గోవిందం కాంబో.. స్పెషలేంటో తెలుసా..?
Bhola Shankar Movie | హిందీలోనూ భోళా శంకర్ రిలీజ్ కాబోతుంది.. ఎప్పుడంటే?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

