Geeta Govindam | మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో గీత గోవిందం కాంబో.. స్పెషలేంటో తెలుసా..?
Geeta Govindam | బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన సినిమాల్లో టాప్‌లో గీతగోవిందం (Geeta Govindam). పరశురాం (Parasuram) , విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్నా క్రేజీ కాంబినేషన్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత దగ్గర చేసింది. ఈ ముగ్గురూ మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది.
Geeta Govindam | పరిమిత అంచనాల మధ్య విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన సినిమాల్లో టాప్‌లో గీతగోవిందం (Geeta Govindam). పరశురాం (Parasuram) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఈ క్రేజీ కాంబినేషన్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత దగ్గర చేసింది.
ఈ ముగ్గురూ మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా అలాంటి టైం వచ్చేసింది. పరశురాం, రష్మిక మందన్నాతో కలిసి ఒక్క చోట చేరి సందడి చేసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు విజయ్ దేవరకొండ. వీరు మళ్లీ కలవడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటో తెలుసా..? గీతగోవిందం విడుదలై నేటికి ఐదేళ్లు పూర్తయింది. ఆనాటి మధురక్షణాలను గుర్తు చేసుకుంటూ ఛిల్ అవుట్ అయ్యారు. ఈ రోజు చాలా జరుగుతోంది. మొదటగా అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.. మరొకటి ఏంటంటే ఈ డార్లింగ్స్‌తో గీతగోవిందం ఐదేండ్లు పూర్తయింది. ఇంకోటి ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ రెడీ అవుతోంది.. అని క్యాప్షన్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్‌లో సమంత హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే మరోవైపు పరశురాం, విజయ్ దేవరకొండ కాంబోలో VD 13 తెరకెక్కుతోంది. హై బడ్జెట్ ఎంటర్టైనర్గా గా రాబోతున్న ఈ సినిమాలో సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. VD 13 ఈ బ్యానర్లో వస్తున్న 54వ ప్రాజెక్ట్.
The much awaited collaboration of THE #VijayDeverakonda, @parasurampetla, & @svc_official’s #VD13 is officially launched today.
The talented @mrunal0801 joins the stellar cast.
Shoot begins soon.#SVC54@Thedeverakonda#KUMohanan @GopiSundarOffl #VasuVarma #DilRaju #Shirish pic.twitter.com/ZzOfigIvme
— Sri Venkateswara Creations (@SVC_official) June 14, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

