Bhola Shankar Movie in Hindi | ఇప్పటివరకు చిరు కెరీర్లో బిగ్గెస్ట్ ఫ్లాప్ ఏదంటే మెగా అభిమానులు సైతం మరోమారు ఆలోచించకుండా చెప్పే పేరు ఆచార్య. తొలి సారి తండ్రి, కొడుకులు కలిసి నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ రకంగానూ సాటిస్ ఫై చేయలేక ఫస్ట్ వీకెండ్లోనే వాష్ అవుట్ అయిపోయింది. దీని లాస్ తక్కువలో తక్కువ రూ.50 కోట్లకు పై మాటే. ఇక గత శుక్రవారం విడుదలైన భోళా శంకర్ దీనికి మించిన లాస్ వెంచర్లా కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపుగా ఈ సినిమాకు కేటాయించిన థియేటర్లలో జైలర్ బొమ్మ పడిపోయింది. ఉన్నంతలోనైనా కాస్త బెటర్‌గా పర్ఫార్మ్ చేస్తుందంటే అదీ లేదు. సోమవారం ఈ సినిమా కలెక్షన్లు లక్షల్లోకి పడిపోయాయి.
అటు చిరును, ఇటు మెగా ఫ్యాన్స్‌ను తీవ్రంగా ఈ సినిమా డిసప్పాయింట్ చేసింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 25న ఈ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్టయిన వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కింది. కంటెంట్ సినిమాల రుచిని కోరుకుంటున్న సమయంలో రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాలు ప్రేక్షకులకు నబ్బడం లేదు. పైగా ఏళ్లు దాటిన సినిమాలను ఎంత మాత్రము పట్టించుకోరని భోళా శంకర్‌తో స్పష్టం అయింది. అయితే హిందీలో మాత్రం మాస్ సినిమాలకు మంచి గిరాకీ ఉంటుంది.
అందులోనూ ఈ మధ్య సౌత్ సినిమాలు హిందీలో చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. కాబట్టి భోళా శంకర్‌ను ఇష్టపడే వారు కూడా హిందీలో ఉంటారనడంలో ఆశ్చర్యమేమి లేదు. ఈ సినిమాను హిందీలో ఆర్కేడీ స్టూడియోస్ రిలీజ్ చేస్తుంది. తాజాగా మేకర్స్ హిందీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మెగాస్టార్‌కు హిందీలో జాకీ ష్రాఫ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఇక చిరు ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ కురసాల సినిమాకు రెడీ అవుతున్నాడు. గోల్డెన్ బాక్స్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై చిరు పెద్ద కూతురు సుస్మిత ఈ సినిమాను నిర్మించనుంది. ఇక దీనితో పటుగా చిరు.. బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్టతో ఓ భారీ బడ్జెట్ పీరియాడిక్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.