నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు చేసేందుకే ఎక్కువ ఇష్టపడుతుంది అందాల యాంకరమ్మ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj). ఈ హాట్ బ్యూటీ ఇప్పటికే రంగస్థలం లాంటి భారీ ప్రాజెక్టులో పోషించిన రంగమ్మత్త పాత్ర సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ భామ చేతిలో ప్రస్తుతం ఆచార్య (Acharya), పుష్ప (Pushpa), ఖిలాడీ (Khiladi) లాంటి భారీ ప్రాజెక్టులున్నాయి. దీంతోపాటు తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఫ్లాష్ బ్యాక్ (Anasuya Bharadwaj)లో కీలకపాత్రలో నటిస్తోంది. ఇందులో కూడా అనసూయ పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతుందట.
ప్రభుదేవా, రెజీనా ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్లాష్‌బ్యాక్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అనసూయ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకునే పనిలో బిజీగా ఉంది. దీనికి సంబంధించిన స్టిల్ ఒకటి ఒపుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. డాన్ సాండీ (Dan Sandy) దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై పీ రమేశ్ పిళ్లై నిర్మిస్తున్నారు. తెలుగు హక్కులను సొంతం చేసుకున్న ఏఎన్ బాలాజీ ఈ చిత్రాన్నితెలుగులో విడుదల చేస్తున్నారు.
ఎమోషనల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయేలా ఉండనుందని టాక్. త్వరలో విడుదల కానున్న ఈ ప్రాజెక్టుకు శ్యామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్టర్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!