 
                                                            Itlu Me Yedhava | కటారి త్రినాథ్ కటారి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ ఇట్లు మీ ఎదవ ‘. వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బళ్లారి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాహితి అవంచ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్, సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యూత్ ఫుల్ ఫన్, బ్యూటీఫుల్ లవ్ స్టొరీ, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ట్రైలర్ అదిరిపోయింది.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో హీరో, దర్శకుడు త్రినాథ్ కటారి మాట్లాడుతూ.. ‘ ఈ సినిమాకి కథే హీరో. ఇందులో నేను ఎదవ అని ఒక క్యారెక్టర్ చేశాను. ఇది ఒక తండ్రీకొడుకులు కథ, తండ్రీకూతుళ్ల కథ. ఒక అమ్మాయి అబ్బాయి కథ. ఈ ముగ్గురు మధ్య ఉండే లవ్ స్టోరీ. నిర్మాత బళ్లారి శంకర్ చాలా మంచి వ్యక్తి. పట్నాయక్‌కు ఈ కథ చెప్తున్నప్పుడే ఒక హిట్ సినిమాకి పనిచేయబోతున్నాం అని చెప్పారు. అది చాలా ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాలో అందరూ మంచి పాత్రలు చేశాం. 100% మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తాం. ‘ అని తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ.. ‘నాకు బాపు గారి సినిమా చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ సినిమా చేస్తే ఆ కోరిక తీరుతుందని ఫీలింగ్ వచ్చింది. త్రినాథ్ డెడికేటెడ్‌గా ఫ్యాషనెటెడ్ గా ఈ సినిమాకి పనిచేశారు. ఈ సినిమాకి టైటిల్ సూచించింది కూడా నేనే. కథ విన్నప్పుడే హిట్ వైబ్ వచ్చింది. ఈ సినిమా చూసిన తర్వాత ఇంతకంటే మంచి టైటిల్ మరొకటి లేదనిపించింది. ఇది యూత్ అందరికీ తెగ నచ్చుతుంది. యూత్ వాళ్ళ పేరెంట్స్ ని కూడా తీసుకెళ్లి చూపించే సినిమా అవుతుంది. సినిమా క్లైమాక్స్ లో మీరు ఊహించని అద్భుతమైన కంటెంట్ ఉంటుంది. నటీనటులందరూ అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో చాలా ఎంజాయ్ చేశాను . టెక్నీషియన్స్ అందరూ చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది.’ అని అన్నారు.
హీరోయిన్ సాహితీ మాట్లాడుతూ.. ‘ ఇది చాలా బ్యూటిఫుల్ స్టోరీ. మంచి ఎమోషన్స్ ఉంటాయి. అందరూ ఎంజాయ్ చేసే సినిమా ఇది. అందరూ కనెక్ట్ అయ్యే సినిమా. మా డైరెక్టర్ చాలా క్లియర్ విజన్ తో చేశారు. ఆయన వల్లే ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ చేయగలిగాం. మా నిర్మాత శంకర్ చాలా మంచి పర్సన్. మా మీద నమ్మకంతో సినిమా చేశారు. తప్పకుండా ఆయనకి చాలా మంచి విజయం దొరుకుతుందని కోరుకుంటున్నాను.’ అని అన్నారు.
 
                            