 
                                                            Allu Arha | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తూనే ఉంది. ఈసారి వారి వారసురాలు అల్లు అర్హ తన అల్లరితో, స్టైల్‌తో హాలోవీన్ వేడుకలను మరింత స్పెషల్‌గా మార్చింది.చిన్నప్పటి నుంచే సెలబ్రిటీ కిడ్స్‌లో టాప్‌లో నిలిచిన అల్లు అర్హ, ఈసారి హాలోవీన్ సందర్భంగా తన అన్న అల్లు అయాన్ తో కలిసి సూపర్ క్యూట్ లుక్‌లో కనిపించింది. అమ్మ అల్లు స్నేహా రెడ్డి షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
హాలోవీన్ థీమ్‌కి తగ్గట్టుగా అర్హ మంత్రగత్తె లాంటి బ్లాక్ అవుట్‌ఫిట్‌లో, పొడవాటి టోపీతో, కంటి దగ్గర చిన్న సాలీడు పెయింట్‌తో కనిపించింది. ఈ లుక్ చూసిన నెటిజన్లు “అందమైన చిన్న మంత్రగత్తె”, “మినీ స్టైల్ ఐకాన్” అంటూ ఫిదా అవుతున్నారు.ఇక స్నేహా షేర్ చేసిన స్టోరీస్‌లో అయాన్ కూడా ఫన్నీ మాస్క్ ధరించి సిస్టర్‌తో కలిసి హాలోవీన్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించాడు. ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన శాకుంతలం సినిమాలో చిన్న భరతుడి పాత్రతో అల్లు అర్హ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆమెకు ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఏర్పడింది.
మరోవైపు అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం “పుష్ప 2: ది రూల్” తో ప్రేక్షకులని పలకరించి మంచి విజయం సాధించాడు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తన 22వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా, సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తానికి హాలోవీన్ వేడుకల్లో అర్హ, అయాన్ల లుక్ ఇప్పుడు టాలీవుడ్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.
 
                            