 
                                                            గట్టుప్పల్ : మండలాభివృద్ధి ప్రత్యేక దృష్టిని సారించాలని జడ్పీ సీఈవోతో శ్రీనివాసరావు ( CEO Srinivas Rao) అధికారులకు సూచించారు.శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. నూతన మండలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కాంట్రాక్టర్లకు తగు సూచనలు ఇవ్వాలని అన్నారు.
అనంతరం క్రిమిటోరియం, డంపింగ్ యార్డును సీఈవో పరిశీలించాలన్నారు. కురుస్తున్న వర్షాల వల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వసంత లక్ష్మి, ఎంపీవో సునీత, సిబ్బంది జయ రాజు, పంచాయతీ కార్యదర్శి షఫీ, తదితరులు పాల్గొన్నారు.
 
                            