Mega Concert | ఏ.ఆర్ రెహమాన్ కన్సర్ట్‌లో పెద్ది అప్డేట్.. బుచ్చిబాబు పోస్ట్ వైరల్
Peddi First Single | మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న గ్రామీణ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’.
Peddi First Single | మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న గ్రామీణ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శ్రీలంకలో రొమాంటిక్ సాంగ్ షూటింగ్లో ఉంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తించాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ను పంచుకున్నాడు దర్శకుడు బుచ్చిబాబు సానా.
ఆస్కార్ విజేత, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ నవంబర్ 8న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించే ‘ది వండర్మెంట్ హైదరాబాద్’ మ్యూజిక్ కాన్సర్ట్‌లో ‘పెద్ది’ సినిమా ఫస్ట్ సింగిల్ విడుదల కాబోతుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలకు బలం చేకూరుస్తూ.. దర్శకుడు బుచ్చిబాబు తాజాగా ఒక పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌లో నవంబర్ 8న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగబోయే రెహమాన్ కన్సర్ట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న. ఆరోజు పెద్ది కూడా అప్డేట్ ఉండబోతుంది.. అప్పటివరకు వెయిట్ చేయడంటూ బుచ్చి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. దీంతో పెద్ది ఫస్ట్ సింగిల్ కన్ఫర్మ్ అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, సీనియర్ నటుడు జగపతి బాబు, బాలీవుడ్ నటుడు దివ్యేందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్, ఏఆర్ రెహమాన్ సంగీతంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
Can’t wait to experience the magic of @arrahman sir live on Nov 8th at the #MegaConcert ❤️🤗🙏
Every tune he creates turns into pure emotion💫Honoured to be working with the maestro for our next film #PEDDI 🔥
Let’s meet at the concert sir🥳 Something special is yet to come🌟 pic.twitter.com/S472E4VEwl
— BuchiBabuSana (@BuchiBabuSana) October 31, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
AP News | ఏపీలో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో నిందితుడి దాడి.. పరిస్థితి విషమం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

