Tamannah Bhatia | ఇండస్ట్రీలో ప్రేమకథలకు ఎప్పుడూ కొదవుండదు. ఇంకా చెప్పాలంటే సినిమాల కంటే ఎక్కువగా బయటే ప్రేమకథలు ఎక్కువగా నడుస్తుంటాయి. అందుకే ఎప్పుడూ ఏదో ఒక హీరో.. హీరోయిన్ లవ్‌లో ఉందనే వార్తలు వస్తునూ ఉంటాయి. అలా తమన్నా కూడా కొన్ని రోజులుగా ప్రేమలో ఉందనే వార్తలు వస్తున్నాయి. నాని హీరోగా వచ్చిన ఎంసీఏ సినిమాలో విలన్ విజయ్ వర్మతో తమ్మూ ప్రేమలో ఉందని.. త్వరలోనే అతడిని పెళ్లి కూడా చేసుకోబోతుందనే వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య గోవాలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో ఇద్దరూ ముద్దు పెట్టుకుంటూ మీడియాకు దొరికిపోయారు. దాంతో అప్పటి వరకు గోప్యంగా ఉన్న ఈ ఇద్దరి ప్రేమకథ.. తాజాగా బయటికి వచ్చేసింది. అప్పట్నుంచి ఈమె ప్రేమ గురించి మీడియా కనిపించిన ప్రతిచోటా అడుగుతూనే ఉంది.
తాజాగా ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ జంట తమ ప్రేమను అఫిషియల్ చేసినట్లు అర్థమవుతుంది. తాజాగా విజయ్ వర్మ చేసిన ఓ పోస్ట్ చూసిన తర్వాత తమన్నాతో తన ప్రేమ అధికారికమే అని ప్రకటించినట్లు అనిపిస్తుంది. తమన్నాతో తాను ప్రేమలో ఉన్నట్టు చిన్న హింట్ ఇచ్చాడు ఈయన. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరి కాళ్లు కనబడుతున్నట్లు పోస్ట్ చేసి.. మధ్యలో లవ్ సింబల్ పెట్టాడు. దీన్నిబట్టి చూస్తే తమన్నా, విజయ్ వర్మ లవ్ స్టోరీ నిజమే అని అర్థమవుతుంది. తెలుగులో ఎంసీఏ తర్వాత మళ్లీ నటించలేదు విజయ్. కానీ హిందీలో మాత్రం రణ్వీర్ సింగ్ గల్లీ బాయ్, అలియా భట్ డార్లింగ్స్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
దాంతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తుంటాడు విజయ్. ఎప్పుడూ బిజీగానే ఉంటాడీయన. అదే సమయంలో తమన్నాతో ఏర్పడిన స్నేహమే ఇప్పుడు ప్రేమగా మారిందని తెలుస్తుంది. వీళ్ల ప్రేమను పెళ్లి వరకు నడిపించాలనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వాలెంటైన్స్ డే సందర్భంగా విజయ్ వర్మ తన కాలును మరో రహస్య పాదం వైపు చూపిస్తూ పోజిచ్చాడు. వీళ్ల జోరు చూస్తుంటే త్వరలోనే పప్పన్నం పెట్టేలా కనిపిస్తున్నారు కూడా.
RRR at Oscars | హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూయిజ్‌ను కలిసిన చంద్రబోస్