ఇరిగేషన్‌కు డిప్యుటేషన్‌పై మరో ఆర్మీ ఆఫీసర్
ఎస్ఎల్బీసీ టన్నెల్, కాళేశ్వరం పునరుద్ధరణ పనులకు నిపుణులైన మరో ఆర్మీ అధికారిని డిప్యుటేషన్‌పై పంపేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ముగ్గురు అధికారుల పేర్లను ప్రభుత్వానికి పంపుతూ, వారిలో ఒక ఆఫీసర్‌ను ఎంచుకోవాలని రాష్ర్టానికి సూచించింది.
- రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో కేంద్రం అంగీకారం
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ఎస్ఎల్బీసీ టన్నెల్, కాళేశ్వరం పునరుద్ధరణ పనులకు నిపుణులైన మరో ఆర్మీ అధికారిని డిప్యుటేషన్‌పై పంపేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ముగ్గురు అధికారుల పేర్లను ప్రభుత్వానికి పంపుతూ, వారిలో ఒక ఆఫీసర్‌ను ఎంచుకోవాలని రాష్ర్టానికి సూచించింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల న్యూఢిల్లీలో భారత సైన్యాధిపతి జనరల్ ధీరజ్ సేథ్‌ను ఆయన అధికారిక నివాసంలో ప్రత్యేకంగా కలిసి ఆర్మీ ఇంజినీరింగ్ అధికారులను తెలంగాణకు డిప్యుటేషన్‌పై పంపించాలని కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్స్‌లోని మిలిటరీ సెక్రటరీ విభాగం తెలంగాణ ప్రభుత్వానికి ముగ్గురు ఆర్మీ అధికారుల పేర్లను లెఫ్టినెంట్ కల్నాల్ సత్యదేవ్సింగ్, లెఫ్టినెంట్ కల్నాల్ రంజిత్ ఏ మీనన్, లెఫ్టినెంట్ కల్నల్ హెచ్వీ భల్లా పేర్లను డిప్యుటేషన్‌పై పంపేందుకు ప్రతిపాదించింది.
వారిలో ఒకరిని ఎంచుకోవాలని సూచించింది. ఆర్మీ ప్రధాన కార్యాలయానికి, జనరల్ ధీరజ్ సేథ్‌కు మంత్రి ఉత్తమ్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్రం ప్రతిపాదించిన ముగ్గురి సేవలను వినియోగించుకోవాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ముగ్గురు అధికారుల్లో ఒకరిని ఎస్ఎల్ బీసీ సొరంగం రెండు వైపులా జరుగుతున్న తవ్వకం పనుల పర్యవేక్షణకు, మిగిలిన ఇద్దరు అధికారులను మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు నియమించాలని భావిస్తున్నట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLC Dasoju Sravan | తెలంగాణలో భయానకమైన పరిస్థితులు ఉన్నాయి : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Race Course Land: రేస్ కోర్స్ స్థలాన్ని ఐఏఎఫ్కే ఇవ్వండి.. రాజ్‌నాథ్‌కు లేఖ రాసిన ఏపీ సింగ్
‘పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలి’
High BP | రక్తపోటు ఉన్నవారు మందులను మానేస్తే కలిగే దుష్పరిణామాలు ఇవే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

