Thandel | టాలీవుడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తాజా ప్రాజెక్టుల్లో ఒకటి తండేల్ (Thandel). చందూమొండేటి దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో NC23 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న తండేల్‌లో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటిస్తున్నాడు. తండేల్‌లో సాయిపల్లవి (Sai Pallavi) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోండగా.. శ్రీకాకుళం అమ్మాయి సత్య పాత్ర పోషిస్తోంది. చైతూ అండ్ చందూమొండేటి టీం ఇప్పటికే లాంఛ్ చేసిన సత్య మేకింగ్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. అయితే తండేల్ విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయంటూ ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీనిక్కారణం డిసెంబర్ క్యూలైన్లో భారీ చిత్రాలుండటమేనన్న టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప ది రూల్, రాంచరణ్ గేమ్ ఛేంజర్, మంచు విష్ణు కన్నప్ప సినిమాలతోపాటు నితిన్ రాబిన్ హుడ్ కూడా డిసెంబర్లోనే రాబోతున్నాయి. ఇలా వరుస సినిమాలు లైన్లో ఉన్న నేపథ్యంలో తండేల్‌ను 2025 జనవరిలో లేదా ఫిబ్రవరిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని తెగ చర్చ నడుస్తోంది. మరి ఈ విషయంపై మేకర్స్ నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.
2018లో గుజరాత్ జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న తండేల్ ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. నాగచైతన్య-చందూ మొండేటి కాంబోలో రాబోతున్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే మేకర్స్ తండేల్ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్‌లో చైతూ మత్య్సకారుడిగా మాస్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు.
Maharaja | తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో విజయ్ సేతుపతి మహారాజ అరుదైన ఫీట్
Krishna Vamsi | రాంచరణ్ రెడీ అయితే నేనూ కూడా రెడీ సార్.. కృష్ణవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్
Double iSmart | బాలీవుడ్లో రామ్ టీం డబుల్ ఇస్మార్ట్ ప్లాన్
Shiva Balaji | 200 యూట్యూబ్ ఛానళ్లపై ఫిర్యాదు చేశాం: నటుడు శివబాలాజీ