Devi sri prasad | అప్పుడెప్పుడో 1999లో దేవి సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు దేవి శ్రీ ప్రసాద్. ఆ సినిమా తర్వాత ఆనందం సినిమా ఈయనకు తొలి బ్రేక్ ఇచ్చింది. మన్మథుడు సినిమాతో మొదటి సారి నాగార్జున లాంటి స్టార్ హీరో ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు దేవి శ్రీ ప్రసాద్. ఇక ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, రవితేజ, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ ఇలా చెప్పుకుంటూ పోతే డీఎస్పీతో పనిచేయని స్టార్ హీరో లేడు. ఇంకా చెప్పాలంటే దేవి శ్రీ ప్రసాద్ తో పనిచేయని టాలీవుడ్ హీరో లేడు. ఇన్నేళ్లుగా ఎంత మంది మ్యూజిక్ డైరెక్టర్లు కాంపిటీషన్‌గా వచ్చినా కూడా అలాగే అగ్రస్థానంలో ఉన్నాడు. కానీ గత రెండు మూడేండ్లుగా దేవి పీఠం కదిలింది.
వరుస విజయాలతో తమన్ సత్తా చూపిస్తున్నాడు. ఒకప్పటి కంటే ఫ్రెష్ మ్యూజిక్ ఇస్తూ సంచలన విజయాలు అందుకుంటున్నాడు తమన్. అల వైకుంఠపురంలో, అఖండ, క్రాక్ లాంటి సినిమాలు కేవలం తమన్ మ్యూజిక్ వల్ల మరో 25 శాతం అదనంగా హిట్ అయ్యాయి అంటే అతిశయోక్తి లేదు. ప్రస్తుతం టాలీవుడ్లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే తమన్ పేరు అందరూ ముందుగా చెబుతున్నారు. కోల్పోయిన స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకోవడానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత యుద్ధం మొదలు పెట్టినట్లు అర్థమవుతుంది. దీనికి 2022 వేదిక కానుంది.
గతేడాది డిసెంబర్లో విడుదలైన పుష్పతో సంచలనం సృష్టించాడు డీఎస్పీ. ఈ సినిమా పాటలు ప్రపంచవ్యాప్తంగా దుమ్ము దులిపేశాయి. 2022లో వరసగా పెద్ద సినిమాలతో రాబోతున్నాడు DSP. ఇప్పటికే ఈ ఏడాది సంక్రాంతికి రౌడీ బాయ్స్ సినిమాతో వచ్చాడు. సినిమా ఎలా ఉన్నా పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరిలో రవితేజ ఖిలాడి.. శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలతో రాబోతున్నాడు. ఏప్రిల్‌లో ఎఫ్ 3 విడుదల కానుంది. వీటితో పాటు భవదీయుడు భగత్ సింగ్, చిరంజీవి బాబీ సినిమా, రంగ రంగ వైభవంగా, పుష్ప 2 ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. వీటితో మళ్లీ నెంబర్ వన్ అవుతానంటున్నాడు దేవి శ్రీ ప్రసాద్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
DSP in Pawan kalyan Movie | పవన్ కళ్యాణ్ కోసం నటుడిగా మారిన దేవి శ్రీ ప్రసాద్..?
Pushpa: పుష్ప చిత్రంతో బన్నీకి నేషనల్ అవార్డ్ రావడం ఖాయం.. దేవి శ్రీ స్టన్నింగ్ కామెంట్స్
పది రోజుల్లోనే 1 మిలియన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో అల్లు అర్జున్ ఆల్ టైం రికార్డ్..
Salaar | మళ్లీ అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తున్న ప్రభాస్ !
Renu desai reentry | రవితేజ సినిమాతో రేణు దేశాయ్ రీ ఎంట్రీ !