అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 చిత్రాల తర్వాత విడుదల అవుతున్న ఈ సినిమా కోసం బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులోనే కాక కేరళలో సైతం ఈ సినిమా కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. తమిళనాడులోనూ ఐకాన్ స్టార్ ప్రభజంనం అంచనాలకందట్లేదు. మరీ ముఖ్యంగా నార్త్ లో అదీ బాలీవుడ్ లో సైతం పుష్ప మార్కెట్ బాహుబలిని క్రాస్ చేసేలా దూసుకుపోతుంది.
పుష్ప సినిమాకు సంబంధించిన వీడియోలలో బన్నీ గెటప్స్ ఆయన మేనరిజం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాయి. తనకు తగ్గట్టు అద్భుతంగా మలచుకున్న బన్నీ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాడు. ఆయన పై సామాన్యులే కాక సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపించారు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అల్లు అర్జున్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం పుష్ప యూనిట్ తమిళనాడులో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో దేవిశ్రీ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో బన్నీ నటనకి నేషనల్ అవార్డు తప్పక వస్తుందని కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఈ సినిమాకి గాను అల్లు అర్జున్ మేకోవర్, యాక్టింగ్ పొటెన్షియల్ ఎంతగానో పెంచుకున్నాడని.. అందుకే అంత నమ్మకంగా ఉన్నానని చెప్పాడు. మరి దేవి శ్రీ చెప్పినట్టు బన్నీకి నేషనల్ అవార్డ్ వస్తే అభిమానులకి అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు.