Prabhas Salaar | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మళ్లీ తన బాహుబలి సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడేమో అనిపిస్తోంది. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. బాహుబలి రెండో భాగం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 2 వేల కోట్ల రూపాయలు వసూలుచేసింది. భారతీయ సినీ చరిత్రలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో వచ్చిన ఇమేజ్ను కాపాడుకుంటూ.. అలాంటి భారీ చిత్రాలనే ఎంచుకుంటున్నాడు. అలా ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ఒకటి సలార్. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకొచ్చింది.
సలార్ సినిమాను కేజీఎఫ్ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలింస్ సలార్ సినిమా తెరకెక్కిస్తుంది. కేజీఎఫ్‌లాగే అద్బుతమైన యాక్షన్, కమర్షియల్, హీరోయిజంతో నిర్మిస్తున్నది. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్నది. సలార్ సినిమా కథ కూడా చాలా పెద్దగా ఉందని.. అందుకే ఈ సినిమాను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ వార్తలు నిజమై.. సలార్ రెండు భాగాలుగా విడుదలైతే అటు దర్శకుడికి ఇటు హీరో ప్రభాస్ కు తమ సెంటిమెంట్ కు కూడా కలిసొచ్చినట్లే. కేజీఎఫ్ ను రెండు భాగాలుగా తెరకెక్కించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ బాహుబలి రెండు పార్టుల సినిమానే. కాబట్టి ఈ సెంటిమెంట్ వర్కవుట్ అయితే సలార్ బ్లాక్‌బస్టర్ అవుతుందని అనుకుంటున్నారు. రెండు భాగాలుగా సినిమా రిలీజైతే.. అటు ప్రొడ్యూసర్లకు కూడా రెట్టింపు బిజినెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ దీనిపై సలార్ చిత్ర బృందం అధికారికంగా ఇంకా ఏ ప్రకటన చేయలేదు. సలార్ విడుదల తేదీ, ఇతర అంశాలపైనా అప్డేట్ ఇవ్వలేదు.
ప్రభాస్ సలార్‌తో పాటు ఆదిపురుష్ సినిమా చిత్రీకరణ పూర్తి చేశాడు. ఆయన చేతిలో ప్రస్తుతం ప్రాజెక్ట్ కె, స్పిరిట్ ఉన్నాయి. రాధే శ్యామ్ సినిమా మార్చిలో విడుదలకు సిద్ధమవుతుండగా..దర్శకుడు మారుతితో ప్రభాస్ ఓ సినిమాకు చర్చలు జరుపుతున్నాడని తెలుస్తోంది. ఏమైనా మరో మూడేళ్ల పాటు ప్రభాస్ తీరిక లేకుండా షూటింగ్స్‌లో పాల్గొనబోతున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
Radhe shyam | రాధేశ్యామ్ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా…
పదేండ్ల క్రితం మన హీరోలు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలిస్తే షాకవుతారు?
దటీజ్ రెబల్ స్టార్ !! హాలీవుడ్లో కూడా విడుదల కానున్న ప్రభాస్ సినిమా
చిరంజీవి కాదన్న కథతో ప్రభాస్.. కామెడీ చేయబోతున్న డార్లింగ్..