చిరంజీవి కాదన్న కథతో ప్రభాస్.. కామెడీ చేయబోతున్న డార్లింగ్..

Chiranjeevi and Prabhas | ఇండస్ట్రీలో ఒక హీరో వదిలేసిన కథ మరో హీరో చేయడం కామన్. అందరికీ అన్ని కథలు నచ్చాలని రూల్ లేదు. కొందరికి నచ్చిన కథ మరికొందరికి నచ్చదు. ఇప్పుడు కూడా ఇదే జరిగిందని తెలుస్తుంది. చిరంజీవికి నచ్చని ఒక కథ ప్రభాస్‌కు నచ్చి ఆయన ఓకే చెప్పాడని ప్రచారం జరుగుతోంది. ఇదే కథను అల్లు అర్జున్ కూడా వదిలేసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజులుగా మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాజా డీలక్స్ అనే ఒక సినిమా రాబోతోందని ఇండస్ట్రీలో వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం అప్పుడే మొదలైపోయాయి. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు మారుతి.

ఇది పూర్తయిన వెంటనే ప్రభాస్ సినిమాపై ఫోకస్ చేయనున్నాడు. వీలైనంత తక్కువ బడ్జెట్లో చాలా తక్కువ సమయంలో ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. వరుసగా పాన్ ఇండియన్ సినిమాలతో జోరు చూపిస్తున్న రెబల్ స్టార్.. కాస్త రిలీఫ్ కోసం కామెడీ సినిమా చేయాలని ఫిక్స్ అయిపోయాడు. అందుకే మారుతి చెప్పిన కథకు కనెక్ట్ అయ్యాడు. హీరో పారితోషకం పక్కన పెడితే 50 కోట్ల లోపు బడ్జెట్ తోనే ఈ సినిమా పూర్తి కానుందని తెలుస్తోంది. ఈ మధ్య ఎక్కువగా సీరియస్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు ప్రభాస్. యాక్షన్ జోనర్‌లోనే ఇరుక్కుపోయాడు. అందులోంచి బయటకు రావాలని మారుతితో కామెడీ సినిమా చేయబోతున్నాడు. రాజా డీలక్స్ పూర్తిగా ఎంటర్టైన్మెంట్ జోనర్ లోనే రాబోతుందని తెలుస్తోంది. కేవలం మూడు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసి.. ఆరు నెలల్లో విడుదల చేయాలని మారుతి ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకు ముందు ప్రభాస్ బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాల్లో కామెడీ బాగానే ట్రై చేశాడు. ఆ క్యారెక్టర్స్ బాగా వర్కౌట్ అయ్యాయి కానీ సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. మరి ఈసారి మారుతి ఈ బ్యాడ్ సెంటిమెంట్ బ్రేక్ చేస్తాడా లేదా చూడాలి. ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్, ఆదిపురష్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్, సలార్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Bheemla Nayak | భీమ్లా నాయక్ డేట్ మళ్లీ మారిందా.. ఏకంగా చిరంజీవితోనే పోటీ..?
Unstoppable | చిరంజీవిని కాదని బాలయ్యతో అన్ స్టాపబుల్ చేయడానికి కారణాలేంటి?
కృతిశెట్టికి నచ్చిన హీరో ఎవరు? బేబమ్మకు లెటర్ రాసిన స్టార్ హీరో ఎవరంటే..
Radhe shyam | ప్రభాస్ రాధే శ్యామ్ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

