Unstoppable | చిరంజీవిని కాదని బాలయ్యతో అన్ స్టాపబుల్ చేయడానికి కారణాలేంటి?

Balakrishna and chiranjeevi | బాలయ్యతో టాక్ షో చేయాలనుకునే ఆలోచనే అద్భుతం. ఆలోచనకు తగ్గట్టుగానే ఇప్పుడు ఫలితం కూడా వచ్చింది. అల్లు అరవింద్ ( Allu Aravind ) ముందు నుంచి అనుకుంటున్నట్లు ఆహా మొదలు పెట్టిన తర్వాత.. ఈ స్థాయిలో వ్యూవర్ షిప్ సాధించిన టాక్ షో మరొకటి లేదు. ఇండియాలోనే హైయెస్ట్ రేటింగ్ సాధించిన షో అన్ స్టాపబుల్ ( Unstoppable ). IMDB దీనికి 9.8 రేటింగ్ ఇచ్చింది. ఇప్పటివరకు నటుడిగా అలరించిన బాలకృష్ణ.. హోస్ట్ పాత్రలో కూడా అదరగొట్టాడు. ఎవరూ ఊహించని విధంగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. వచ్చిన గెస్టులతో ఆయన మాట్లాడే విధానం అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా విడుదలైన మహేశ్ బాబు ప్రోమో కూడా అదిరిపోయింది. తనకంటే చిన్న వారిని ప్రేమించడం.. పెద్ద వాళ్లతో మర్యాదగా మాట్లాడటం బాలయ్యకు మాత్రమే సాధ్యమైంది. అయితే మెగా కాంపౌండ్‌లో అంత మంది హీరోలు ఉండగా.. వాళ్లను కాదని బాలయ్యతో టాక్ షో ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానికి కారణాలు ఇప్పుడు వివరించాడు రైటర్ బీవీఎస్ రవి.
అన్‌స్టాపబుల్ షోకు బీవీఎస్ రవి రైటర్‌గా పనిచేసిన ఈయన.. మెగాస్టార్ చిరంజీవిని కాదని బాలయ్యతో టాక్ షో చేయడానికి గల కారణాలను తెలిపాడు. అల్లు అరవింద్ అంటే ఓ కంపౌండ్‌కు మాత్రమే సొంతమైన వ్యక్తి కాదని.. ఆయన అందరికీ కావలసిన వ్యక్తి.. అందరితోనూ బాగుంటారు.. అన్ని పనులు తానే స్వయంగా చూసుకుంటూ ఉంటారని చెప్పుకొచ్చాడు రవి. ఇండస్ట్రీలో ఉన్న అన్ని కుటుంబాలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని.. అక్కినేని కుటుంబంతో కూడా ఎన్నో సినిమాలు తెరకెక్కించడం జరిగిందని గుర్తు చేశాడు.
నందమూరి కుటుంబంతో అల్లు అరవింద్ కుటుంబానికి 40 ఏళ్లుగా అనుబంధం ఉందని తెలిపాడు. అన్‌స్టాపబుల్ షోకి బాలయ్యను తీసుకోవడానికి గల కారణాలు కూడా చెప్పాడు రవి. బాలయ్య హోస్ట్ గా చేస్తే.. ఆ ఆలోచనే విభిన్నంగా ఉంటుంది అల్లు అరవింద్‌కు ఆ ఆలోచన రాగానే బాలయ్యకు చెప్పడం.. ఆయన కూడా ఒప్పుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి అని చెప్పాడు బీవీఎస్ రవి. చిరంజీవికి ఈ షో మొదలవ్వక ముందే అన్ని విషయాలు తెలుసని కూడా చెప్పాడు బీవీఎస్ రవి. అలాగే దానికి వచ్చే అతిథుల లిస్టు కూడా చిరంజీవికి తెలుసు అంటున్నాడు ఈయన. అన్నీ తెలిసి షో సక్సెస్ అవ్వాలని చిరంజీవి తమను విష్ చేశాడంటూ చెప్పుకొచ్చాడు ఈయన. చిరంజీవితో షో చేయాలనే ఆలోచన అల్లు అరవింద్‌కు ఎప్పుడూ లేదంటున్నాడు బీవీఎస్ రవి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | బెంగాలీలో ట్వీట్ చేసిన చిరంజీవి.. కారణం ఏంటో తెలుసా..?
RC15 | ఒక్క పాటకే 25 కోట్లా.. మరి సినిమా టోటల్ బడ్జెట్ ఎంత?
Aacharya | ఆ విషయంలో చిరంజీవి, బాలకృష్ణను ఇప్పటి హీరోలు అందుకోగలరా..?
డిస్నీ హాట్‌స్టార్‌లో బాలకృష్ణ అఖండ సరికొత్త రికార్డులు.. 24 గంటల్లో 10 లక్షలకుపైగా వ్యూస్
Akhanda | RTC క్రాస్ రోడ్స్ లో బాలయ్య అఖండ ప్రభంజనం..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

