Akhanda | RTC క్రాస్ రోడ్స్ లో బాలయ్య అఖండ ప్రభంజనం..

Akhanda collections in RTC X roads | నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే కుటుంబ ప్రేక్షకులు కూడా థియేటర్స్ కు కదిలివచ్చారు. రొటీన్ సినిమా అనే టాక్ వచ్చినా కూడా కలెక్షన్ల పరంగా మాత్రం అఖండ సంచలనం సృష్టించాడు. థియేటర్లలో రూ.75 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్ అన్ని కలిపి రూ.200 కోట్లు వసూలు చేసింది అఖండ.
ఈ రోజుల్లో ఒక సినిమా మూడు వారాలు థియేటర్లలో ఆడటమే గగనం అనుకుంటే.. ఏకంగా 103 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది బాలయ్య అఖండ సినిమా. కరోనా సమయంలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా రారా అనే అనుమానాలు అందరిలోనూ ఉండేవి. అలాంటి క్లిష్ట సమయాల్లో ఇంట్లో ఉన్న ప్రేక్షకులను థియేటర్స్ వైపు అడుగులు వేసేలా చేశాడు బాలయ్య. 40 రోజులు దాటిన తర్వాత కూడా కొన్ని సెంటర్స్ లో ఈ సినిమాకు హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి. దీన్ని బట్టి బాలకృష్ణ మాస్ జాతర ఏ స్థాయిలో కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే తాజాగా మరో రికార్డు అందుకుంది అఖండ సినిమా. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసింది అఖండ సినిమా. ఈ మధ్య కాలంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కోటి రూపాయలు వసూలు చేసిన సినిమా మరొకటి లేదు. 50 రోజులు దిగ్విజయంగా అక్కడ పూర్తి చేసుకున్న అఖండ ఇంకా థియేటర్స్ లో ఉంది. సినిమా ఓటీటిలో విడుదలైన తర్వాత కూడా ఈ సినిమాకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కలెక్షన్స్ వస్తున్నాయి. ఏదేమైనా సరైన సమయంలో బాలయ్యకు సరైన సినిమా పడింది. అది కేవలం బాలయ్యకు మాత్రమే కాదు కష్టాల్లో ఉన్న ఇండస్ట్రీకి కూడా ఊపిరిగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Tollywood | ఆ విషయంలో బాలీవుడ్‌ను వెనక్కి నెట్టేసిన టాలీవుడ్..
Nivetha Thomas | జై బాలయ్య పాటకు స్టెప్పులేసిన నివేదా థామస్
Aacharya | ఆ విషయంలో చిరంజీవి, బాలకృష్ణను ఇప్పటి హీరోలు అందుకోగలరా..?
డిస్నీ హాట్‌స్టార్‌లో బాలకృష్ణ అఖండ సరికొత్త రికార్డులు.. 24 గంటల్లో 10 లక్షలకుపైగా వ్యూస్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

