Nivetha Thomas | జై బాలయ్య పాటకు స్టెప్పులేసిన నివేదా థామస్

Nivetha Thomas | అఖండ సినిమాతో చాలా రోజుల తర్వాత బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు నందమూరి బాలకృష్ణ. బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత తెరుచుకున్న థియేటర్లకు ఊపిరిపోసింది అఖండ సినిమా. ఇక ఈ సినిమాలో యాక్టింగ్, డ్యాన్స్ అన్నీ ఇరగదీశాడు బాలయ్య. ముఖ్యంగా జై బాలయ్య సాంగ్‌లో మాస్ స్టెప్పులు వేసి అదరగొట్టాడు. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. దీనికి నెటిజన్లు తమదైన స్టెప్పులు వేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ నివేదా థామస్ కూడా జై బాలయ్య అంటూ స్టెప్పులు వేసింది.

సోషల్‌మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే నటి నివేదా థామస్. తరచూ పోస్టులు, వీడియోలు పెడుతూ ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంటుంది ఈ భామ. ఈ క్రమంలోనే ఇటీవల రిలీజై.. సూపర్ హిట్ అయిన అఖండ సినిమాలోని జై బాలయ్య పాటను కాపీ కొడుతూ డ్యాన్స్ చేసింది. ఆ పాటలో బాలకృష్ణ వేసిన స్టెప్పులను అచ్చం అలాగే వేసింది. ఒకదాని తర్వాత మరో షర్ట్ విప్పేసుకుంటూ వెళ్లే డ్యాన్స్ మూమెంట్‌ను నివేదా థామస్ ట్రై చేసింది. మొదటి షర్ట్ మారే వరకు డ్యాన్స్ బాగానే చేసింది నివేదా థామస్. కానీ రెండో షర్ట్ మార్చుకునేప్పుడే బెడిసికొట్టింది. స్టెప్పు వేసేటప్పుడు షర్ట్ సరిగ్గా రాలేదు. అయినప్పటికీ.. ఫన్ క్రియేట్ చేస్తూ ఆ డ్యాన్స్ మూమెంట్‌ను అలాగే వేసింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఏదేమైనా అఖండ ఎక్స్పీరియన్స్ అదిరిపోయింది అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇది ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Arjun Kapoor | బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ఇంట్లో నలుగురికి కరోనా పాజిటివ్
Shyam singha roy | బాలీవుడ్ వైపు వెళ్తున్న నాని శ్యామ్ సింగరాయ్..
నాకు బ్లాక్ బస్టర్ ఇవ్వకపోతే చంపుతా.. ఆ దర్శకుడికి బాలయ్య వార్నింగ్..
Bala Krishna: మల్టీ స్టారర్ చేసేందుకు సిద్ధమని చెప్పిన బాలకృష్ణ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

