ముంబై : ఓ వైపు దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాప్తిచెందుతున్నది. మరో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల బాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు మహమ్మారి బారినపడ్డ విషయం తెలిసిందే. తాజాగా మరో బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కుటుంబంలో కరోనా పాజిటివ్‌గా తేలింది. అర్జున్ కపూర్‌తో పాటు రియా కపూర్, కరణ్ బూలానీ, అన్షులా కపూర్‌కు సైతం కొవిడ్ పాజిటివ్‌గా తేలింది.
కరీనా కపూర్ ఖాన్ కొవిడ్ బారినపడి కోలుకున్న తర్వాత అర్జున్ కపూర్‌తో పాటు అతని సోదరి అన్షులా కపూర్ మహమ్మారి బారినపడ్డారు. దీంతో ఇద్దరు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల తమను కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. అర్జున్ కపూర్ గర్ల్‌ఫ్రెండ్ మలైకా అరోరా సైతం కొవిడ్ పరీక్షలు చేసుకోగా.. నెగెటివ్‌గా వచ్చింది. ఇటీవల అర్జున్ కపూర్, మలైకా ఇటీవల ముంబైలో రొమాంటిక్ డిన్నర్ డేట్లో కనిపించారు.
అలాగే రియాకపూర్తో పాటు ఆమె భర్త కరణ్ బూలానీ సైతం కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిద్దరు కూడా క్వారంటైల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా అర్జున్‌కపూర్ గతేడాది సెప్టెంబర్‌లో తొలిసారిగా కరోనా బారినపడ్డాడు. తాజాగా అర్జున్ కపూర్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అతని నివాసానికి సీల్ వేసింది. ఇంటి పరిసరాలను శానిటైజేషన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.