డిస్నీ హాట్‌స్టార్‌లో బాలకృష్ణ అఖండ సరికొత్త రికార్డులు.. 24 గంటల్లో 10 లక్షలకుపైగా వ్యూస్

Akhanda in Disney plus Hotstar | నటసింహ నందమూరి బాలకృష్ణ ఎక్కడ అడుగుపెడితే అక్కడ రికార్డులు తిరగరాస్తున్నాడు. ముఖ్యంగా ఆయన నటించిన అఖండ సినిమా మొన్నటి వరకూ థియేటర్స్ లో విశ్వరూపం చూపించింది. ఇప్పుడు ఓటీటీలో కూడా సంచలనం సృష్టిస్తోంది. ఈ మధ్య కాలంలో ఏ పెద్ద సినిమాకు సాధ్యం కాని విధంగా.. ఇండియాలో మరో సినిమా కలలో కూడా ఊహించని విధంగా ఓటీటీలో సరికొత్త చరిత్రకు తెర తీస్తున్నాడు బాలకృష్ణ.
బోయపాటి శ్రీను కాంబినేషన్లో బాలయ్య నటించిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో కూడా అఖండమైన విజయం అందుకుంది ఈ సినిమా. డిసెంబర్ 2న విడుదల అయిన ఈ సినిమా దాదాపు 75 కోట్ల షేర్ వసూలు చేసింది. 50 రోజులు పూర్తయిన తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో జనవరి 21 సాయంత్రం 6 గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతుంది అఖండ సినిమా. వచ్చిన క్షణం నుంచి రికార్డులు తిరగ రాస్తూ ఉన్నాడు బాలయ్య. ఇప్పటి వరకు హాట్ స్టార్ డిస్నీలో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇదే అంటూ అధికారికంగా వాళ్లే ట్వీట్ చేశారు. బాలయ్య దెబ్బకు రికార్డులన్నీ మరుగున పడిపోయాయి.
కేవలం 24 గంటల్లో 1 మిలియన్ అంటే 10 లక్షల మంది ఈ సినిమాను చూశారు. ఇప్పటి వరకు టాలీవుడ్లో మాత్రమే కాదు.. ఇండియాలో కూడా ఏ ఓటీటీ వేదికపై 24 గంటల్లో ఒక సినిమాను ఇంత మంది వీక్షించలేదు. బాలకృష్ణ మాస్ ఇమేజ్ కు ఇది నిదర్శనం. రాబోయే రోజుల్లో బుల్లితెరపై అఖండ మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ నటించిన ఈ సినిమాకు థమన్ సంగీతం ప్రాణంగా నిలిచింది. బోయపాటి మాస్ డైరెక్షన్ కూడా అఖండ సినిమాకు అదనపు ఆకర్షణ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజర్ రిలీజ్.. మళ్లీ అదే కాన్సెప్ట్‌తో..
నాకు బ్లాక్ బస్టర్ ఇవ్వకపోతే చంపుతా.. ఆ దర్శకుడికి బాలయ్య వార్నింగ్..
Tollywood | ఆ విషయంలో బాలీవుడ్‌ను వెనక్కి నెట్టేసిన టాలీవుడ్..
Nivetha Thomas | జై బాలయ్య పాటకు స్టెప్పులేసిన నివేదా థామస్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

