ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజర్ రిలీజ్.. మళ్లీ అదే కాన్సెప్ట్‌తో..

Aa Ammayi Gurinchi Meeku Cheppali | హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసే హీరో సుధీర్ బాబు. మరోవైపు ఒకసారి తనకు కనెక్ట్ అయితే వరుసపెట్టి వాళ్లతోనే సినిమాలు చేసే దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. అలాంటి వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు వస్తున్న సినిమా అమ్మాయి గురించి మీకు చెప్పాలి. నాలుగేళ్ల కింద సుధీర్ బాబు ఇంద్రగంటి కాంబినేషన్ లో వచ్చిన సమ్మోహనం మంచి విజయం సాధించింది. ఆ సినిమాలో సినిమా నేపథ్యం తీసుకున్నాడు దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ. అదితి రావు హైదరి ఆ సినిమాలో హీరోయిన్గా నటించింది.
ఆ తర్వాత సుధీర్ బాబుతోనే వి సినిమా చేశాడు ఇంద్రగంటి. ఇది నాని 25వ సినిమా ఇందులో సుధీర్ బాబు కీలక పాత్రలో నటించాడు. వి అనుకున్న అంచనాలను అందుకోలేదు. ఇదిలా ఉంటే తాజాగా సుధీర్ బాబుతో మూడో సినిమా చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే ఆసక్తికరమైన టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది. ఇందులో కూడా సినిమా నేపథ్యమే తీసుకున్నాడు ఇంద్రగంటి. హీరో సుధీర్ బాబు ఇందులో దర్శకుడిగా నటిస్తున్నాడు.
ఒక రియలిస్టిక్ డ్రామా సినిమాగా చెయ్యాలి అనుకున్నప్పుడు హీరోయిన్ కృతి శెట్టి ఎదురు పడుతుంది.. సినిమా అంటే ఇష్టం లేని పాత్రలో ఆమె కనిపిస్తుంది. ఆమెను ఒప్పించి సినిమా ఎలా చేసాడు.. ఈ ప్రయాణంలో ఇద్దరి మధ్య ఏం జరిగింది అనేది సినిమా కథ. తాజాగా విడుదలైన సినిమా టీజర్ చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటికే షూటింగ్ సగానికిపైగా పూర్తయింది. త్వరలో సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ మధ్య కాలంలో సరైన విజయం లేని సుధీర్ బాబు కెరీర్‌కి ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా సక్సెస్ కీలకంగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
ఈ ఫొటోలో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా?
Meera jasmine | దాదాపు ఆరేళ్ల తర్వాత రీఎంట్రీకి సిద్ధమైన బబ్లీ బ్యూటీ
Sushanth | రూట్ మార్చిన అక్కినేని మేనల్లుడు
Pooja Hegde | గృహ ప్రవేశం చేసిన పూజా హెగ్డే.. ఫోటోలు వైరల్..
సౌత్ కొరియాలో పుష్ప ‘ఊ అంటావా’ సాంగ్ క్రేజ్ చూస్తే మతిపోతుంది: వైరల్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

