Sushanth | రూట్ మార్చిన అక్కినేని మేనల్లుడు

Sushanth | అప్పుడెప్పుడో కాళిదాసు సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు సుశాంత్. అక్కినేని బ్యాక్‌గ్రౌండ్ ఉండటంతో ఈజీగానే ఇండస్ట్రీకి ఎంట్రీ పాస్ దొరికింది. కానీ ఇప్పటి వరకు హీరోగా గుర్తింపు కోసం పాకులాడుతూనే ఉన్నాడు సుశాంత్. కాళిదాసు తర్వాత వచ్చిన కరెంట్ సినిమా బాగానే నడిచినప్పటికి స్టార్ మాత్రం కాలేకపోయాడు. కరెంట్ తర్వాత అడ్డా, ఆటాడుకుందాం రా వంటి సినిమాలు ఎప్పుడొచ్చి వెళ్లాయో కూడా తెలియదు. దీంతో కొంచెం రూట్ మార్చి అల వైకుంఠపురములో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశాడు సుశాంత్. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ పేర్లను చూసి ఆ సినిమాలో నటించాడు.
గత ఏడాది సుశాంత్ హీరోగా ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమా వచ్చింది. దర్శన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. చాలా ఏళ్ల పాటు గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేశాడు సుశాంత్. ఈ సినిమా కోసం బాగానే మేకోవర్ కూడా అయ్యాడు. అయితే ఇచ్చట వాహనములు నిలపరాదు ఫలితం చూసిన తర్వాత తన కెరీర్ పట్ల సుశాంత్ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై హీరోగా నటించి అనవసరంగా అభాసుపాలు కావడం కంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫిక్స్ అయిపోవడం మంచిదని ఆయన నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. అందుకే ఇప్పుడు రవితేజ సినిమాలో కూడా సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తున్నాడు సుశాంత్. మాస్ రాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రావణాసుర సినిమాలో రామ్ పాత్రలో నటిస్తున్నాడు సుశాంత్. ఈ సినిమాకు సంబంధించి మొదటి రోజు షూటింగ్ లో పాల్గొన్నాడు అక్కినేని మేనల్లుడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి రావణాసుర తర్వాత సుశాంత్ కెరీర్ ఎలా మారిపోతుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Pooja Hegde | గృహ ప్రవేశం చేసిన పూజా హెగ్డే.. ఫోటోలు వైరల్..
Khiladi | తగ్గేదే లే.. అనుకున్న తేదీకే వస్తున్న ఖిలాడీ..
Kiran Abbavaram | ఆ కుర్రాడిలో విషయం ఉంది.. దూసుకుపోతున్న కిరణ్ అబ్బవరం..
ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్ జంటకు అమ్మాయి పుట్టింది !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ravanasura
- Sushanth
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

