Pooja Hegde | గృహ ప్రవేశం చేసిన పూజా హెగ్డే.. ఫోటోలు వైరల్..

Pooja Hegde | తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం నంబర్ వన్ హీరోయిన్ ఎవరు అంటే.. మరో అనుమానం లేకుండా అందరూ చెప్పే పేరు పూజా హెగ్డే. గత మూడు నాలుగు ఏళ్లుగా పూజ టైం నడుస్తుంది. ఇక్కడ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ అదే స్థాయిలో విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో ఒక మైలురాయి అందుకుంది. ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న సొంత ఇంటి కల నెరవేర్చుకుంది ఈ భామ. తెలుగుతో పాటు హిందీలో కూడా వరుస సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే ముంబైలో కొత్త ఇల్లు కొనుక్కుంది. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు తాజాగా పూర్తి చేసింది పూజా హెగ్డే. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాంప్రదాయ దుస్తులు ధరించి.. చేతిలో టెంకాయ పట్టుకొని భక్తితో దేవుడికి మొక్కుతూ పూజా హెగ్డే ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ప్రస్తుతం సినిమాల పరంగా పూజా హెగ్డే కెరీర్ దూసుకుపోతుంది. తెలుగులో త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ప్రభాస్ రాధే శ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది.
మరోవైపు హిందీలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న బీస్ట్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా ప్రతి ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో నటిస్తూ జోరు చూపిస్తుంది పూజా హెగ్డే. ఒక్కో సినిమాకు కనీసం రూ.3 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. హైదరాబాద్‌లో కూడా సొంత ఇల్లు తీసుకోవాలని ప్రయత్నిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Radhe shyam | ప్రభాస్ రాధే శ్యామ్ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..?
Samantha item song | టాప్ ఫామ్‌లో ఉన్నపుడే ఐటమ్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు వీళ్లే.
Radhe Shyam: బీచ్‌లో పూజా హెగ్డేతో రొమాన్స్.. టీజర్ అదిరిపోయింది..!
Pooja Hegde | బికినీలో పూజా హెగ్డే అందచందాలు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

