యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన చిత్రం రాధేశ్యామ్. జనవరి 14న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. రీసెంట్గా ‘ఈ రాతలే..’ అంటూ లిరికల్ సాంగ్ విడుదలై మంచి ఆదరణను రాబట్టుకున్నసంగతి తెలిసిందే. తాజాగా రెండో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఓ సినిమాకు సంబంధించి ఒకే పాటను రెండు రకాలుగా వినొచ్చని రాధే శ్యామ్‌ను రూపొందించిన నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ తెలియజేసింది.
సోమవారం ‘రాధే శ్యామ్’ లవ్ ఆంథమ్ ప్రోమో (హిందీ వెర్షన్) ‘ఆషికీ అంటూ విడుదలైన ఈ సాంగ్‌లో ప్రభాస్, పూజాల పెయిర్ చాలా చాలా బాగుంది. లిరికల్‌గానూ విజువల్గానూ సాంగ్ అదిరిపోతుంది అన్నట్లు హింట్ ఇచ్చింది ప్రోమో. హిందీ వెర్షన్‌కి మిథున్, మణ్ణన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. అర్జిత్ సింగ్ చాలా చక్కగా పాడారు. సాయంత్రం 7 గంటలకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ‘రాధే శ్యామ్’ లవ్ ఆంథమ్ ప్రోమో రిలీజ్ కానుంది. డిసెంబర్ 1న ఫుల్ సాంగ్ రాబోతోంది.
యువీ క్రియేషన్స్, టి సిరీస్ సంస్థలపై మూడు వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద, ప్రశీద ఈ చిత్రాన్ని రూపొందించారు. జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ సినిమాను డైరెక్ట్ చేశారు. సాహో విడుదలై రెండేళ్ల దాటేసింది. దీంతో ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా రాధే శ్యామ్ కోసం ఎదురు చూస్తున్నారు.