న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా తన అభిమానులకు ఇవాళ ఓ సర్ప్రైజ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పిన ప్రియాంకా.. తమకు ప్రైవసీ ఇవ్వాలంటూ ఓ ఇన్‌స్టా పోస్టులో కోరింది. అయితే ప్రియాంకా, నిక్ జోనాస్‌లకు పుట్టింది ఆడా లేక మగ పిల్లవాడా అన్న క్లారిటీ ఇవ్వలేదు. కానీ దీనికి సంబంధించి యూఎస్ వీక్లీ ఓ వార్తను పబ్లిష్ చేసింది. ప్రియాంకా, నిక్ జంట ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్లు ఓ రిపోర్ట్‌లో తెలిపింది. బేబీ గర్ల్ పుట్టినట్లు సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయ్యానీ తన సోషల్ మీడియా అకౌంట్లో వెల్లడించాడు. కానీ ప్రియాంకా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రియాంకా, నిక్‌లు ఇద్దరూ మెసేజ్ ప్రజెంట్ చేశారు. దీంతో ఫిల్మ్, పాప్ ఇండస్ట్రీ నుంచి ఆ దంపతులకు గ్రీటింగ్స్ వెల్లువెత్తుతున్నాయి. 2018లో నిక్, ప్రియాంకా పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.