రాధేశ్యామ్ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా…

Radheshyam Release Date | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్నాడు.ప్రస్తుతం ఈయన నటించిన రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కృష్ణంరాజు కీలకపాత్ర పోషించనుండగా..ప్రభాస్ కు జోడిగా పూజా హెగ్ధే హీరోయిన్ గా నటిస్తుంది. షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఇదే నెల సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు..కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది.
కాగా ఈ చిత్రం మార్చి 18 న విడుదలవుతుందని వార్తలు వచ్చినా ట్రిపుల్ ఆర్ కూడా అదే డేట్ ను దాదాపుగా కన్ఫామ్ చేసింది. అటు మార్చి 17న పునీత్ రాజ్ కుమార్ చివరిగా నటించిన జేమ్స్ సినిమా కూడా విడుదలవుతోంది. అంతే కాకుండా మార్చి 17 నుంచి 23 వరకు కన్నడ లో జేమ్స్ కాకుండా మరో సినిమా విడుదల చేయకూడదని కన్నడ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాధేశ్యామ్ చిత్రాన్ని 18న విడుదల చేయకూడదని డిసైడ్ అయ్యారని టాక్. కొన్ని రోజులుగా ఈ చిత్రం ఓటీటీలో విడుదవుతుంది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ అవన్నీ పుకార్లే అని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ వెల్లడించాడు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మర్చి 4 న రాధే శ్యామ్ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తివేయడం, థియేటర్స్ ఆక్యుపెన్సీ విషయంలోనూ సడలింపులు మొదలయ్యాయి.ఇక ఫిబ్రవరి లో పూర్తి స్థాయిలో థియేటర్లు ఓపెన్ అవుతాయని అప్పడే సినిమా తేదీని ప్రకటించాలని రాధేశ్యామ్ బృందం భావిస్తున్నారట.
పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కృష్ణం రాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ ,ప్రసిదలతో కలిసి భూషణ్ కుమార్ సంయక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్రభాస్ ఇందులో హస్గ సామద్రికుడిగా కనిపించనున్నాడు.ఈ చిత్రానికి సంగీతం.. జస్టిన్ ప్రభాకరణ్, సినిమాటోగ్రఫి.. మనోజ్ పరమహంస, ఎడిటర్ కోటగిరి.. వెంకటేశ్వరరావు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

