Renu desai reentry | రవితేజ సినిమాతో రేణు దేశాయ్ రీ ఎంట్రీ !

Renu desai reentry | రేణు దేశాయ్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పుడు కేరాఫ్ పవన్ కళ్యాణ్ గా ఉండే ఈమె ఆ తర్వాత తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంటుంది. 17 ఏండ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు దేశాయ్.. మధ్యలో ఒక మరాఠీ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. పలు టీవీ షోలకు హోస్ట్‌గా ఉన్న ఈమె.. ఇప్పుడు మళ్లీ నటన వైపు కూడా వచ్చేస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్ బలంగా ఉండాలని ప్లాన్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆ మధ్య బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో హీరో అక్కగా నటించడానికి ఓకే చెప్పింది. కానీ అనుకోని కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు ఈమెకు మరో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.
టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా బెల్లంకొండ శ్రీనివాస్ ఒక సినిమా చేయాలని అనుకున్నాడు. దీనికి స్టూవర్ట్‌పురం దొంగ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ఈ సినిమాలో హీరో అక్క పాత్ర కోసం రేణు దేశాయ్‌ని అనుకున్నారు. కథాబలం ఉండటంతో తన రీఎంట్రీకి ఇదే సరైన క్యారెక్టర్ అని భావించిన రేణు దేశాయ్ కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించి బెల్లంకొండ శ్రీనివాస్ లుక్‌ను కూడా విడుదల చేశారు. కానీ అక్కడే అసలు సమస్య వచ్చింది. ఈ పోస్టర్ రిలీజ్ చేసిన సమయంలోనే రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో కూడా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌ను అనౌన్స్ చేశారు. రెండు సినిమాలు ఒకే కథతో వస్తుండటంతో బెల్లంకొండ శ్రీనివాస్ వెనక్కి తగ్గాడు. స్టూవర్ట్‌పురం దొంగ సినిమా ఆగిపోయింది. రవితేజ టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా వస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈ క్రమంలోనే టైగర్ నాగేశ్వరరావు సినిమాలో సేమ్ అదే హీరో అక్క పాత్రలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ వేగంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది రేణు దేశాయ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
Pawan Kalyan: పవన్ కూతురిలో ఇంత టాలెంట్ ఉందా.. మురిసిపోతున్న మెగా ఫ్యాన్స్
అకీరా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడుగా..!
ఆ హీరోయిన్ కోసం రవితేజను బాలయ్య కొట్టాడా? గొడవలపై క్లారిటీ వచ్చేసింది
Renu desai reentry | రవితేజ సినిమాతో రేణు దేశాయ్ రీ ఎంట్రీ !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

