పెళ్లి సందడి బ్యూటీ వెనుకపడుతున్న డైరెక్టర్లు.. ఇదే జోరు కొనసాగితే స్టార్ హీరోయిన్ కావడం పక్కా!!

Sreeleela upcoming projects | దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు పర్యవేక్షణలో నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన చిత్రం పెళ్లి సందడి. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటించింది. గతేడాది దసరాకు విడులైన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. ముఖ్యంగా శ్రీలీల నటన, గ్లామర్ కోసమైనా కుర్రకారు థియేటర్లకు పరుగులు పెట్టారు. ఈ ఒక్క సినిమాతో శ్రీలీల ఇప్పుడు బిజియెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. యంగ్ డైరెక్టర్స్ తమ సినిమాలో శ్రీలలనే హీరోయిన్గా ఉండాలని అనుకుంటున్నారు. దీంతో ఈమెకు అవకాశాలు వరుసగా క్యూ కడుతున్నాయి. దీంతో ఇప్పటికే శ్రీలీల నాలుగు సినిమాలను లైన్లో పెట్టింది.
ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. దీంతోపాటు రౌడీ బాయ్స్ సినిమాతో మెప్పించిన ఆశిష్ రెడ్డి తదుపరి చిత్రం సెల్ఫిష్, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ సినిమాలో హీరోయిన్గా నటించనుంది. ఇక ఇప్పటికే త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ధమాకా సినిమాలో సెకండ్ హీరోయిన్గా కన్ఫార్మ్ అయింది. ఇవే కాకుండా తమిళంలో కూడా ఒక సినిమాకు సైన్ చేసిందని సమాచారం. ఇదే జోరు కొనసాగి ఈ సినిమాలు సక్సెస్ అయితే వచ్చే రెండు మూడేండ్లలో శ్రీలీల స్టార్ హీరోయిన్ల జాబితాలో నిలవడం ఖాయంగా కనిపిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
OTT | 100 రోజులు దాటినా పెళ్లి సందD ఇంకా ఓటీటీలో ఎందుకు రాలేదు..?
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
sree leela: పెళ్లి సందడి బ్యూటీ వెనక పడుతున్న టాలీవుడ్ హీరోలు
Sree Leela Break| సినిమాలకు పెళ్లి సందD హీరోయిన్ బ్రేక్ ..కారణమేంటో తెలుసా..?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

