Pawan Kalyan: పవన్ కూతురిలో ఇంత టాలెంట్ ఉందా.. మురిసిపోతున్న మెగా ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్- రేణూదేశాయ్‌ల పిల్లలు అకీరా, ఆద్యలకు సంబంధించి ఏ వార్త బయటకు వచ్చిన కూడా అది కొద్ది క్షణాలలోనే వైరల్ అవుతూ ఉంటుంది. ఆ మధ్య అకీరా కర్ర సాము వీడియో ఒకటి బయటకు రాగా, ఇందులో అకీరా కర్రసాము చేస్తున్న విధానం చూసి.. రాబోయే రోజుల్లో ఆయన కూడా తండ్రిలాగే వెండితెరను ఉర్రూతలూగిస్తాడని జోస్యాలు చెప్పారు.వీలైనంత త్వరగా వెండితెర ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరారు.
ఇక ఆద్య విషయానికి వస్తే ఈ చిన్నారికి సంబంధించిన ఏ విషయం అయిన బయటకు వస్తే అది అభిమానులని తెగ ఆకట్టుకుంటుంది. తాజాగా రేణూ దేశాయ్ తన సోషల్ మీడియాలో ఆద్యకి సంబంధించి ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆద్య ప్రతిభను అందరికీ పరిచయం చేసింది. ఆద్య గిటార్ వాయిస్తూ పాట పాడటం కనిపిస్తోంది. దీంతో ఆద్య టాలెంట్‌కు అంతా ఫిదా అవుతున్నారు. పవర్ స్టార్ కూతురా? మజాకా? అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
అకీరా నందన్‌కు కూడా మ్యూజిక్ ప్లే చేయడం ఇష్టమన్న సంగతి తెలిసిందే. పియానోను అకీరా నందన్ అద్బుతంగా వాయిస్తాడు. ఆ మధ్య ఉత్తేజ్ కూతురు పాటతో కలిసి తెగ సందడి చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాని షేక్ చేసింది. ఇక పవన్ విషయానికి వస్తే ఆయన నటించిన భీమ్లా నాయక్ సంక్రాంతి బరిలో విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత క్రిష్, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ వంటి దర్శకులతో పలు సినిమాలు చేయనున్నారు.
https://www.instagram.com/reel/CXBtkRPBnII/?utm_source=ig_web_copy_link
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- adhya
- Pawan Kalyan
- renu desai
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

