allu ayaan in ghani | అల్లు వారి కుటుంబం నుంచి మరో వారసుడు సిద్ధమవుతున్నాడు. అల్లు రామలింగయ్య తెలుగు ఇండస్ట్రీలోనే లెజెండరీ కమెడియన్. ఆయన వారసుడిగా అల్లు అరవింద్ కూడా అప్పట్లో కొన్ని సినిమాల్లో నటించాడు. అయితే తండ్రిలా గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయాడు. ఇప్పుడు అల్లు రామలింగయ్య పేరు నిలబెడుతూ తాతకు తగ్గ మనవడిగా అల్లు అర్జున్ స్టార్ హీరోగా చక్రం తిప్పుతున్నాడు. ఇక నాలుగో తరం కూడా ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది.
గుణశేఖర్ దర్శకత్వంలో సమంత హీరోయిన్గా తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో అల్లు అర్జున్ తనయ అల్లు అర్హ కీలక పాత్రలో నటిస్తోంది. ఇందులో భరతుడి పాత్రలో కనిపిస్తోంది చిన్నారి అర్హ. ఇప్పుడు జూనియర్ బన్నీ కూడా వెండితెరపై ఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన గని లిరికల్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వరుణ్ తేజ్ హీరోగా కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అల్లు అర్జున్ అన్నయ్య అల్లు బాబీ నిర్మిస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. డిసెంబర్ 3న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే విడుదలైన లిరికల్ వీడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ పాటలో అల్లు అర్జున్ తనయుడు అయాన్ కనిపించాడు.
They call him #GHANI video by Ayaan . His Peddanana @allubobby promised him a video in his 1st movie . So there you go . All the best @IAmVarunTej @saieemmanjrekar , @musictamman to the entire cast , crew and the Director of GHANI . pic.twitter.com/JdMXF1Ssna
— Allu Arjun (@alluarjun) November 8, 2021
అయాన్ చేతికి బాక్సింగ్ గ్లౌజ్ పెట్టుకొని.. తలకు రుమాలు చుట్టుకొని బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు జూనియర్ బన్నీ. దీనికి సంబంధించిన వీడియోను అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో విడుదల చేశాడు. తన పెదనాన్న మొదటి సినిమాలో అయాన్‌కు అవకాశం ఇస్తానని మాటిచ్చాడు.. ఇప్పుడు అది చూపించాడు అంటూ పోస్ట్ చేశాడు అల్లు అర్జున్. ఈ ప్రాక్టీస్ అంతా చూస్తుంటే గణేశ్ సినిమాలో జూనియర్ బన్నీ కూడా ఉన్నాడేమో అనే అనుమానాలు వస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Allu Ayaan: అల్లు అయాన్ స్టన్నింగ్ వీడియో.. గని స్టైల్లో చింపి ఆరేశాడు..!
అల్లు అరవింద్ పెద్దబ్బాయి బాబీ గురించి ఈ విషయాలు తెలుసా..?
అల్లు అర్జున్ సినిమాకు బంపర్ ఆఫర్.. హిందీ డబ్బింగ్‌కు భారీ ఆఫర్
Pushpa: హిందీలో పుష్ప రిలీజ్ లేనట్టేనా.. బన్నీ ఆశలు అడియాశలయ్యాయా..!
Allu Arjun | అల్లు అర్జున్-బోయపాటి శ్రీను కాంబోపై క్రేజీ అప్డేట్