అల్లు అరవింద్ పెద్దబ్బాయి బాబీ గురించి ఈ విషయాలు తెలుసా..?

Allu Bobby | మెగా నిర్మాత అల్లు అరవింద్ కు ఇద్దరు కొడుకులు మాత్రమే అని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇద్దరే ఇండస్ట్రీలో ఉన్నారు. కాబట్టి వాళ్ల గురించి మాత్రమే అభిమానులకు తెలుసు. ఇక అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేశ్ ( బాబీ ) ఎక్కువగా మీడియా ముందుకు రాడు. కాబట్టి ఈయన గురించి చాలామందికి పెద్దగా పరిచయం లేదు. కానీ ఈ మధ్యే పెళ్లి చేసుకున్న బాబీ ఇప్పుడు ప్రేక్షకులకు రిజిస్టర్ అయ్యాడు. మరి మెగా నిర్మాత అల్లు అరవింద్ పెద్దబ్బాయి బాబీ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అల్లు బాబీ ఇప్పటికే ఐటీ, మీడియా రంగంలో ఎన్నో అద్భుతాలను సృష్టించాడు. గీతా ఆర్ట్స్ సినీ నిర్మాణంలో తెర వెనుక తన పాత్రను సమర్థవంతంగా పోషించాడు. లండన్, ఆస్ట్రేలియాలో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసి.. టెక్నాలజీ ఇంటర్‌ప్రీటర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు. ఎన్విరాన్మెంట్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ వంటి ఎన్నో సరికొత్త ఆలోచనలతో ఒకటిన్నర దశాబ్దం పాటు ఐటీ రంగంలో తమ వంతు కృషి చేశాడు. ఆ తర్వాత మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్లో ఆన్లైన్ సినిమా టికెట్ వంటి ఇన్నోవేటివ్స్ ప్రారంభించాడు అల్లు బాబీ. జస్ట్ టికెట్స్ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ టికెట్ల అమ్మకానికి అంకురార్పణ చేసి.. ప్రస్తుతం దానికి చైర్మన్‌గా కొనసాగుతున్నాడు అల్లు బాబీ .
అలాగే గీతా ఆర్ట్స్‌లో వచ్చే ప్రతి సినిమాకు తన వంతు బాధ్యతగా తెర వెనుక ఎంతో కృషి చేస్తుంటారు అల్లు వెంకటేశ్. అల్లు అరవింద్ ప్రారంభించిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా కోసం టెక్నాలజీపరంగా ఎన్నో మెళుకువలు అందించాడు. అలాగే ప్రొడక్ట్ స్ట్రాటజీ విషయంలోనూ.. ఆహా ప్రేక్షకుల్లోకి రావాడానికి రోడ్ మ్యాప్‌ను కూడా ఆయనే సిద్ధం చేశాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంతో పాటు సినిమా రంగంలోనూ గత 15 ఏళ్లుగా ఎన్నో విజయాలు అందుకుని తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు అల్లు బాబీ. ఇక ఇప్పుడు నిర్మాతగా గని సినిమాతో తెర ముందుకొస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 3న విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Jai Bhim | కట్ చెప్పినా కన్నీళ్లు ఆగేవి కాదు.. చినతల్లి పాత్రపై లిజోమోల్ ఎమోషన్
Pushpa : హిందీలో పుష్ప రిలీజ్ లేనట్టేనా.. బన్నీ ఆశలు అడియాశలయ్యాయా..!
Puneeth Raj Kumar : పునీత్‌ను తలచుకుని ఎమోషన్ అయిన అల్లు అర్జున్
ఆర్య 3 లో అల్లు అర్జున్ ఉండడా? సుకుమార్ ఎవరికి ఛాన్స్ ఇస్తున్నాడో తెలుసా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

