అల్లు అర్జున్ సినిమాకు బంపర్ ఆఫర్.. హిందీ డబ్బింగ్‌కు భారీ ఆఫర్

allu arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్ డిసెంబర్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ వరుస సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. పుష్ప తర్వాత బోయపాటి శ్రీనుతో ఒక సినిమా, కొరటాల శివతో మరో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో బోయపాటి శ్రీనుతో సినిమా ముందుగా పట్టాలెక్కనుందని తెలుస్తోంది.అంతేకాదు ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు టాలీవుడ్లో చర్చగా మారింది. పట్టాలెక్కడానికి ముందే ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నాడు. కాబట్టి అల్లు అర్జున్‌తో ఇప్పుడుప్పుడే కొరటాల సినిమా ఉండదు. ఇక బోయపాటి శ్రీను విషయానికొస్తే అఖండ సినిమాతో గడిపేస్తున్నాడు. ఈ సినిమా అయిపోతే అల్లు అర్జున్ సినిమాపైనే ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. అంటే కొరటాల కంటే ముందే బోయపాటి శ్రీనుతో బన్నీ సినిమా మొదలుకానుందని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ క్రమంలో వీరి కాంబినేషన్ సినిమాపై ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకొచ్చింది. బోయపాటి, అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన హిందీ డబ్బింగ్ హక్కులకు ప్రముఖ సంస్థల నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దాదాపు 60 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అల్లు అర్జున్ బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సరైనోడు అప్పట్లో భారీ కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ మంచి వ్యూయర్షిప్ వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాకు పెద్ద మొత్తంలో ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పుష్ప సినిమా హిందీ డబ్బింగ్ హక్కులను కూడా ఇలాగే ముందుగానే అమ్మేశారు. కానీ ఇప్పుడు పుష్ప సినిమాను పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేస్తున్నారు. అయితే హిందీ డబ్బింగ్ హక్కులను తీసుకున్న వ్యక్తి.. ఇప్పుడు ఈ సినిమాను హిందీలో రిలీజ్ చేయడానికి ఒప్పుకోవడం లేదు. దీంతో పుష్ప సినిమా హిందీ భాషలో విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
allu bobby | అల్లు అరవింద్ పెద్దబ్బాయి బాబీ గురించి ఈ విషయాలు తెలుసా..?
Pushpa: హిందీలో పుష్ప రిలీజ్ లేనట్టేనా.. బన్నీ ఆశలు అడియాశలయ్యాయా..!
Allu Arjun: మళ్లీ మెగా ఫ్యామిలీ కలిసారుగా..!
Puneeth Raj Kumar : పునీత్‌ను తలచుకుని ఎమోషన్ అయిన అల్లు అర్జున్
Chiranjeevi : అల్లు అర్జున్‌తో మల్టీ స్టారర్ చేయనున్న చిరు.. దర్శకుడు ఎవరో తెలుసా?
allu arjun | ఆర్య 3 లో అల్లు అర్జున్ ఉండడా? సుకుమార్ ఎవరికి ఛాన్స్ ఇస్తున్నాడో తెలుసా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

