గురువారం 25 ఫిబ్రవరి 2021
Cinema - Jan 22, 2021 , 16:39:01

ఆస‌క్తిక‌రంగా సినిమా టైటిల్స్..వీటిని గ‌మ‌నించారా..!

ఆస‌క్తిక‌రంగా సినిమా టైటిల్స్..వీటిని గ‌మ‌నించారా..!

సినిమాపై ఆసక్తి పెరగడానికి టైటిల్ పాత్ర కూడా చాలా ఉంటుంది. కాస్త విభిన్నమైన టైటిల్ పెడితే ఆ సినిమాపై ముందు నుంచి కూడా అంచనాలు బాగానే ఉంటాయి. తెలుగు ఇండస్ట్రీలో అలాంటి కొత్త టైటిల్స్ పెట్టాలంటే ఒకప్పుడు ఈవీవీ సత్యనారాయణ ఉండేవాడు. ఆయన తర్వాత అంత విచిత్రమైన టైటిల్స్ పూరి జగన్నాథ్ పెడతాడు. అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, కెమెరామెన్ గంగతో రాంబాబు ఇలా చాలా ఆసక్తి కరమైన టైటిల్స్ ఆయన సినిమాలకు పెడుతుంటాడు. ఇప్పుడు కూడా విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాకు 'లైగర్' అని విచిత్రమైన టైటిల్ పెట్టాడు. అంటే మగ సింహానికి ఆడపులి పుట్టే సంతానం అన్నమాట. ఇదిలా ఉంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన టైటిల్స్ వచ్చాయి. పైగా అవి చాలా పొడుగ్గా ఉన్నాయి. 

ఉదాహరణకు మహేష్ బాబు హీరోగా పరశురాం తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సర్కారు వారి పాట అనే పొడవైన టైటిల్ పెట్టారు. బ్యాంకుల్లో జరిగే ఆర్థిక నేరాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. గతంలో మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సరిలేరు నీకెవ్వరు ఇలాంటి పొడవైన టైటిల్స్ తో మంచి విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు పరశురామ్ కూడా తన సినిమాకు 'సర్కారు వారి పాట' టైటిల్‌ అనౌన్స్ చేశాడు. మరోవైపు సుశాంత్ హీరోగా నటిస్తున్న సినిమాకు ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. 

చిలసౌ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్.. అల వైకుంఠపురంలో సినిమాలో చిన్న పాత్ర చేశాడు. ఇప్పుడు 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో తొలి విజయం అందుకోవాలని చూస్తున్నాడు. మరోవైపు నాగశౌర్య హీరోగా వస్తున్న కొత్త సినిమాకు 'పోలీసు వారి హెచ్చరిక' అనే విచిత్రమైన టైటిల్ కన్ఫర్మ్ చేసారు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు టైటిల్స్ కాస్త ఆసక్తికరంగా వస్తున్నాయి. అలాగే త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా కూడా 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరి ఇంత భారీ టైటిల్స్ తో సినిమాలు కూడా అంతే భారీ విజయాలు అందుకుంటాయేమో చూడాలి.

ఇవి కూడా చ‌ద‌వండి..

మ‌హేశ్ దుబాయ్ ట్రిప్ వెనుకున్న సీక్రెట్ ఇదే..!

కీర్తిసురేశ్ లుక్ మ‌హేశ్‌బాబు కోసమేనా..?

మ‌హేశ్ బాబు స్కిన్ స్పెష‌లిస్ట్ ఈమెనే..!

ఈ శుక్రవారం కొత్త సినిమా రిలీజ్‌లు లేవు..కార‌ణ‌మేంటో ?

స‌మంతలా పూజాహెగ్డే హ్యాట్రిక్ కొట్ట‌నుందా..?


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo