Amala Paul | ప్రముఖ నటి అమలాపాల్ (Amala Paul) త్వరలో తల్లికాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా నటి సీమంతం వేడుకను (Baby Shower Ceremony) ఘనంగా నిర్వహించారు. గుజరాత్‌లోని సూరత్‌లో నిర్వహించిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను అమలాపాల్ తన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘ప్రేమానురాగాలతో కూడిన సంప్రదాయమైన సీమంతం వేడుక’ అంటూ ఫొటోలకు క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం సీమంతం వేడుకకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు అమలాపాల్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మాలీవుడ్ నుంచి వచ్చి.. తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది అమలాపాల్ (Amala Paul). పాపులర్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ను 2014లో పెళ్లి చేసుకుంది. అయితే, వ్యక్తిగత కారణాలతో 2017తో విజయ్ నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత దాదాపు ఆరేళ్లపాటు ఒంటరిగానే ఉంది. ఈ క్రమంలో గతేడాది రెండో వివాహం చేసుకుంది. లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్, టూరిజం, హాస్పిటాలిటీ ప్రొఫెషనల్ జగత్ దేశాయ్ (Jagat Desai)తో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. గతేడాది నవంబర్ మొదటివారంలో కోచిలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. ఆ తర్వాత ఈ ఏడాది ఆరంభంలో అంటే 2024 జనవరి తొలి వారంలో తాను ప్రెగ్నెంట్ అంటూ అమలాపాల్ ప్రకటించింది. ఈ మేరకు బేబీబంప్ ఫొటోలను కూడా షేర్ చేసింది.
Also Read..
KTR | చిన్నారులతో కలిసి షటిల్ ఆడిన కేటీఆర్.. VIDEO
Hardik Pandya | సోమనాథ్ ఆయంలో హార్దిక్ పాండ్యా పూజలు.. VIDEO
Gold Price | హైదరాబాద్‌లో జీవితకాల గరిష్ఠానికి బంగారం ధరలు.. తులం రూ.71 వేలకు పైనే