Indian 2 | అవినీతి, లంచం అంశాల నేపథ్యంలో శంకర్ తెరకెక్కించిన భారతీయుడు సినిమా బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కమల్ హాసన్ టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం దశాబ్దాల కిందే లంచం భూతం సమాజాన్ని ఎలా పట్టి పీడస్తుందో కండ్లకు కట్టినట్టు చూపించింది. మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత దీనికి కొనసాగింపుగా ఇండియన్ 2 (Indian 2) కూడా వచ్చింది.
సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్ మాట అటుంచితే అవినీతికి పాల్పడిన కుబేరులకు శిక్ష పడాల్సిందేనన్న కాన్సెప్ట్ ప్రశంసించదగినదే. కొన్ని సార్లు జనాలు సినిమాలను స్పూర్తిగా తీసుకునే సంఘటనలు చూస్తుంటాం. హైదరాబాద్‌లోని మణికొండ (Manikonda DEE) మున్సిపాలిటీ డీఈఈ లంచావతరాన్ని భర్తే స్వయంగా బయటపెట్టిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.
డీఈఈగా పనిచేస్తున్న తన భార్య లంచాలకు మరిగి రోజూ లక్షల రూపాయలను ఇంటికి తీసుకొస్తుండటం తట్టుకోలేని భర్త.. అవినీతి సంపాదనను మానుకోవాలని తన భార్యకు సూచించాడు. అయినప్పటికీ వినిపించుకోకపోవడంతో ఆమె అవినీతిని బయటపెట్టాడు. తన భార్య అక్రమ సంపాదనకు సాక్ష్యాలివే అంటూ ఇంట్లో దాచిపెట్టిన డబ్బుల కట్టల వీడియోను తీసి బయటకు రిలీజ్ చేశాడు. ఇప్పుడీ వీడియోను నెట్టింట షేర్ చేస్తూ ఇండియన్ 2 ఎఫెక్ట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.
#NewsUpdate | ஹைதராபாத்தில் லஞ்சம் வாங்கிய மனைவியை காட்டிக் கொடுத்த கணவர் – வைரலாகும் வீடியோ#SunNews | #Hyderabad pic.twitter.com/4UuO1U8eFV
— Sun News (@sunnewstamil) October 9, 2024
SSMB 29 | మహేశ్ బాబు ఎస్ఎస్ఎంబీ 29 మొదలయ్యే టైం చెప్పిన విజయేంద్ర ప్రసాద్
Naga Chaitanya | సుహాస్ జనక అయితే గనక నాగచైతన్య చేయాల్సిందట.. మరి ఏమైందంటే..?
Prabhas | క్రేజీ న్యూస్.. ప్రభాస్ వెడ్డింగ్ అనౌన్స్మెంట్ ఆన్ ది వే..!
Salaar 2 | సలార్ 2లో కాటేరమ్మ ఫైట్‌ను మించిపోయే సీక్వెన్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలే..!